Ys jaganmohan reddy attacks on ap govt for contract outsourceing employees

ys jagan, chandrababu, yanamala, contract employees, outsource, regularisation, ap, assembly

ys jaganmohan reddy attacks on ap govt for contract, outsourceing employees. in ap assembly ysrcp leader ys jaganmohan reddy attacks on govt to regularise the outsource, contract employees in andhrapradesh.

ఎప్పుడు చేస్తారో చెప్పండి: జగన్

Posted: 03/18/2015 10:41 AM IST
Ys jaganmohan reddy attacks on ap govt for contract outsourceing employees

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైన కొద్దసేపటికే ప్రతిపక్షం, అధికారపక్ష నేతల మాటలతో వేడి రాజుకుంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ మేజిఫెస్టోలో ఉద్యోగులకు హామీ ఇచ్చి,ఇఫ్పుడు మాత్రం మాట మారుస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుటిలోగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రభత్వం ఒకవేళ ఉద్యోగులకు న్యాయం చెయ్యకపోతే, తాము అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షనేత లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానమిచ్చారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉంటుందని వెల్లడించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  chandrababu  yanamala  regularisation  ap  assembly  

Other Articles