Shivasena suggest the courts not to involve in religion issues

shivasena, samna, courts, article, region, culture

shivasena suggest the courts not to involve in religion issues. shivasenas mouth piece samna publish a article on religion issues. courts not to involve in the issues which is related to region, traditions.

కోర్టులకు శివసేన సూచన

Posted: 03/16/2015 11:23 AM IST
Shivasena suggest the courts not to involve in religion issues

ముంబైలోని బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మండపాలను, ఉత్సవాలను నిషేధిస్తూ ఇటీవల  ముంబై  హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో  విమర్శలు గుప్పించింది. మతపరమైన నమ్మకాలు,  విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ శివసేన న్యాయస్థానాలకు సలహా ఇచ్చింది. మత నమ్మకాలకు సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోవద్దని, దీనివల్ల గణేష్ ఉత్సవం, నవరాత్రి, దహీహండీ, శివ జయంతి లాంటి హిందువుల పండగల సంస్కృతి నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.  ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ అభిప్రాయాన్ని మొత్తం ప్రజల అభిప్రాయంగా కోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుందని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఉత్సవాలు, పండుగలు లేనపుడు కూడా ముంబాయి నగరం సంవత్సరం మొత్తం అత్యంత రద్దీగా ఉంటుందని  పేర్కొంది. జాతీయ పండుగలను, ఉత్సవాలను నిషేధించడం అంటే ప్రజల్లోని స్పూర్తిని చంపి వేయడమే అని  శివసేన అభిప్రాయపడింది. కోర్టులు ప్రజలందరికి  న్యాయం జరిగేలా వ్యవహరించాలని సలహా ఇచ్చింది.  ముఖ్యంగా  కోర్టులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిదంటూ వ్యాఖ్యానించింది. మొత్తానికి పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎప్పుడూ సూచనలు. వియర్శలు గుప్పించే శివసేన ఇప్పుడు ఏకంగా కోర్టుల మీద పడింది. న్యాయవ్యవస్థ కొన్నింటిని పట్టించుకోకపోవడం మంచిదంటూ సామ్నాలో వచ్చిన కథనం ఇప్పుడు కొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivasena  samna  courts  article  region  culture  

Other Articles