Nda govt will pass the bill in rajyasabha or not

nda govt passed the land acquisition bill in parliament at loksabha. in loksabha nda have the majaority but in rajyasabha nda didnt have majority. congress, bsp, trinamul congress oppose the bill and demand for several changes. but govt ready to changes for 9 only.

nda govt will pass the bill in rajyasabha or not

ప్రత్యేకం: భూసేకరణ బిల్లు గట్టెక్కుతుందా? అటకెక్కుతుందా?

Posted: 03/11/2015 05:45 PM IST
Nda govt will pass the bill in rajyasabha or not

కార్పొరేట్ సంస్థలకు భూమిని సేకరించడం మరింత సులభం చేస్తోంది  ప్రస్తుతం భూసేకరణ చట్టం.  అయితే ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా ఉంది అన్న భావనను దూరం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండే భూములను కార్పోరేట్ వర్గాల కోసం సేకరించమని వారు తెలుసుతున్నారు, కొత్త కంపెనీల స్థాపనతో ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని వారు వివరణ ఇస్తున్నారు. పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు ప్రజల స్థితిగతులను మారుస్తాయన్నది వాస్తవం , కానీ ప్రభుత్వం వాటి ద్వారా కలిగే నష్టాలను కూడా లెక్కించాల్సి వస్తుంది. అయితే భారతదేశంలో సగటు రైతు కష్ట, నష్టాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి.

భూసేకరణ చట్టంలో చేపట్టిన సవరణలపై కేవలం విపక్షాలనుంచి మాత్రమే కాదు మిత్ర పక్షాల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. శిరోమణి అకాలిదళ్, శివసేనలు మొదట్లో బిల్లును వ్యతిరేకించినా చివరకు పార్లమెంట్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేసాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపి, తృణముల్ కాంగ్రెస్ లు తాము మద్దతిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశాయి. అందులో బాగంగా పార్లమెంట్ సమావేశాల నుండి వాకౌట్ చేశాయి.  వీటిన్నింటికి తోడు ఈ సవరణలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు కూడా. ఈ ఆందోళనలకు అన్నా హజారే లాంటి వారు నేతృత్వం వహిస్తుండటం  కేంద్ర ప్రభుత్వానికి కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది అయితే మోదీ సర్కార్ మత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును చట్ట రూపంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. అయితే భూసేకరణ గురించి కొన్ని నిజానిజాలు మీ ముందుకు..

భారతదేశంలో భూసేకరణ ప్రత్యేకంగా ఎన్డీయేనే మొదలు పెట్టినట్లుగా ప్రతిపక్షాలు అపోహలు కల్పిస్తున్నాయన్న వెంకయ్య నాయుడు మాటల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. భారతదేశం తన రాజ్యాంగాన్ని రూపొందించుకునే సమయంలోనే, భారత దేశంలో ఎవరి నుండైనా భూమిని సేకరించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అయితే దీన్ని మన నేతలు చాలా చాకచక్యంగా వాడుకుంటూ, క్యాష్ చేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన కంపెనీలకు ప్రయోజనాలు కల్పించేలా వారు చట్టాలను సవరిస్తున్నారు. అయితే 1959 నుండి 2013 వరకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు ప్రజల నుండి భూములను సేకరించడంలో ముందున్నాయి. కానీ అలా భూములను కోల్పోయిన వారికి ఎంత ప్రయోజనం కలిగింది. భూములను ఇవ్వడం వల్ల జాతికి ఎంత ప్రయోజనం కలిగింది అన్నదే ప్రశ్న. అయితే ఇప్పుడు రైతుల పక్షాన వకల్తా పుచ్చుకున్న పార్టీలు కూడా రైతులను మోసం చెయ్యడంలో తమ వంతు పాత్ర పోషించాయి.

ఇక సెజ్‌లకు కేటాయించిన భూములు ఏవిధంగా పక్కదారి పట్టిందో కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. ఈ నివేదిక ప్రకారం, దేశం మొత్తం మీద సెజ్‌ల కోసం నోటిఫై చేసిన 45,635.63 హెక్టార్లలో, కేవలం 28,488.49 హెక్టార్లలోనే ప్రాజెక్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. అంటే ఇది మొత్తం కేటాయించిన భూమిలో 62.4 శాతం. ఇక 5,402.22 హెక్టార్ల భూమిని డీనోటిఫై చేసి వాణిజ్య కార్యకలాపాలకోసం మళ్లించారు. ఇలా భారత్ లో భూములను అప్పణంగా అప్పగిస్తూ, రైతుల బతుకుల మీద కొడుతూ వచ్చారు.  1894లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని రూపొందించింది. అప్పటి నుండి జాతీయ ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం భూములను సేకరిస్తోంది. జాతీయ రహదారులు, మెట్రో రైల్వేలు, అణువిద్యుత్ కేంద్రాలు, రక్షణ రంగ పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులను జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి కాబట్టి వాటి కోసం భూములను సేకరించి, ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలి. కానీ ప్రభుత్వం అనుకున్నది నిజానికిజరగడం లేదు, వేల ఎకరాల భూములను సేకరించి, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం గత కొన్ని సంవత్సరాలుగా వస్తోంది.

అయితే గత కొన్ని ప్రభుత్వాలకు భిన్నంగా ఎన్డీయే వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. 1991 కి ముందు జరిగిన అభవృద్దికి 1993 తరువాత జరిగిన ఆర్థిక వృద్దికి ఎంతో తేడా ఉంది. అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావ్ ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ తో కలిసి తీసుకు వచ్చిన సంస్కరణలు దేశాన్ని అభివృద్ది వైపు మళ్లించాయి. కానీ ప్రభుత్వం రైతుల గురించి మాత్రం కాస్త తప్పటడుగు వేసింది. కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే అవకాశం ఇస్తూ, రైతుల గోడును పట్టించుకోలేదు. అప్పటి నుండి ప్రారంభమైన ఆ పరంపర ఇంకా కొనసాగుతోంది.

ఎన్డీయే ప్రభుత్వం అనుకున్నట్లు దేశ అభివృద్ది మౌలిక వసతుల కల్పిన మీదే ఆధారపడింది. భారత్ అనుకున్న మేకిన్ ఇండియా కు కూడా భూసేకరణే కీలకం. కానీ రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అలా కానీ పక్షంలో వ్యవసాయం దండగ అన్న వాదన మరింత బలపడి, చివరకు విదేశాల నుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనం అనుకున్న అభివృద్దికి భూసేకరణ అడ్డంకిగా మారకూడదు. కానీ ఎంత భూమిని ప్రభుత్వం తీపుకోవాలి, ఎంత పరిహారం ఇవ్వాలి, సేకరించిన భూమిని ఎలా వినయోగిస్తున్నారు అన్న అంశాలను ఎప్పటికప్పుడు ప్రజాసమక్షంలో పారదర్శకంగా , ఎలాంటి అవినీతికి, పక్ష పాతానికి తావులేకుండా చూడాలి. అలా గనక జరిగితే సేకరించిన ప్రతి అంగుళం ప్రజల అభివృద్దికి దోహదం చేస్తుంది.

తాజాగా పార్లమెంట్ ఉభయసభల్లోని లోకసభలో భూసేకరణ బిల్లును ఎలాగోలా గట్టెక్కించుకుంది ఎన్డీయే. కానీ రాజ్యసభలో మాత్రం ఎలా గట్టెక్కుతుందన్నది ప్రశ్న. లోక్ సభలో గెలిచిన ప్రతి బిల్లు రాజ్యసభలో గెలుస్తుందని నమ్మకం లేదు. అందునా కేవలం రాష్ట్రపతి ప్రసంగానికే అడ్డుతగిలిన విపక్షాలు మరి ముందు నుండి వ్యతిరేకిస్తున్న భూసేకరణ చట్టం బిల్లును ఎలా మద్దతిస్తాయి. దీన్ని బట్టే ఈ సారికి మాత్రం ఎన్డీయేకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రాజ్యసభలో బిల్లు గట్టెక్కుతుందా లేదా అటకెక్కుతుందా అన్నది కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : land pooling  landacquisiation  nda  modi  infrastructure  development  

Other Articles