Amith shah appionted seven central ministers to seven states for bjp

bjp, amithsha, nirmalaseetharaman, nadda, delhi, tamilnadu, kerala

IN an attempt to improve the coordination between the government and the party to implement the government scheme effectively in the states where the BJP has not been able to make major inroads, party chief Amit Shah on Tuesday announced list of seven Union Ministers who would pay special attention to such states.

ఏడు రాష్ట్రాలు ఏడుగురు కేంద్ర మంత్రులు

Posted: 03/11/2015 09:45 AM IST
Amith shah appionted seven central ministers to seven states for bjp

భారతీయ జనతా పార్టీ మరోసారి పార్టీ కార్యకలాపాలపై దృష్టిసారించింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత భాజపా లో కొంత నిరుత్సాహం కనిపిస్తున్నా, దాని నుండి బయటికి వచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా మోదీ హవాతో భాజపాకు మంచి ఓట్లు వచ్చినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అసలు మోదీ ప్రభావం కనిపించలేదు. సాధారణ ఎన్నికల్లో భాజపాకు తగ్గిన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవడానికి నడుంబిగించింది భాజపా నాయకత్వం. అందులో భాగంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పార్టీని పటిష్ఠ పరచడానికి ఓ కొత్త పథకాన్ని రచించారు.

భాజపాకు ఉత్తర భారతంలో ఉన్నంత ఓట్ బ్యాంక్ దక్షిణ భారతంలో లేదన్నది నిజం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో అయితే భాజపా కనీసం ఉనికికి కూడా ఇబ్బంది పడుతోంది. అయితే తాజాగా అమిత్ షా ఇలాంటి రాష్ట్రాలను ఏడింటిని ఎంచుకొని, వాటికి కేంద్ర మంత్రులను అబ్జర్వర్ గా నియమించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డా ఆంధ్రప్రదేశ్కు, పవర్ మినిస్టర్ పీయూష్ గోయల్ తమిళనాడు, పాండిచ్చేరిలకు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పశ్చిమబెంగాల్, రాజవ్ ప్రతాప్ రూఢీ కేరళ, ధర్మేంధ్ర ప్రధాన్ అస్సాం, మహేష్ శర్మ ఒరిస్సా, హంసరాజ్ తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు నియమించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో భాజపా ఇలాంటి మార్పులను కల్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి కొత్తగా ఏడు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు ఎలాంటి మార్పులను తీసుకు వస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  amithsha  nirmalaseetharaman  nadda  delhi  tamilnadu  kerala  

Other Articles