Sensex drops 135 pts to one month low

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Global cues drag Sensex 135 pts to one month low

నెల రోజుల కనిష్టస్థాయికి సెన్సెక్స్..135 పాయింట్ల నష్టం..

Posted: 03/10/2015 06:57 PM IST
Sensex drops 135 pts to one month low

విదేశీ మర్కెట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మరీ ముఖ్యంగా ఏసియా, యూరోప్ మార్కట్ల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలు దేశీమ మార్కట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్ నెల రోజుల కనిష్ట స్థాయికి చేరుకోగా. నిఫ్టీ కూడా నష్టాలను మూటగట్టుకుంది. అటో, దీర్ఘకాలిక వినియోగ వస్తువులు, ఐటీ, లోహం, టెక్ ప్రాజక్టులు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ సెక్టార్లకు సంబంధించిన షేర్లు లాభాల బాటలో పయనించడంతో మార్కట్లు కొంత మేర ఉపశమనం పోందాయి.

సెన్సెక్స్, నిఫ్టీ రెండూ మద్దతు స్థాయిలకు దిగువన  ట్రేడవుతున్నందున ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మదుపరులు విక్రయాలకు ఆసక్తి చూపడంతో.. స్టాక్ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 28 వేల 710 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 8712 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో భారతి ఎయిర్ టెల్, కోల్ ఇండియా, మహింధ్రా అండ్ మహీంద్రా, ఎన్ ఎం ఢీ సీ, లుపిన్ సంస్థల ష్లేరు లాభాలలో ముగియగా,  హెచ్ డీఎఫ్ సీ, డీఎల్ ఎఫ్, జిందాల్ స్టీల్, హిందాల్కో, హిందుస్థాన్ యునీలివర్, సన్ ఫార్మా, డా.రెడ్డీస్ షేర్లు నష్టాల్లో పయనించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles