Dp yadav 3 others awarded life term

DP Yadav, 3 others awarded life term, Controversial Uttar Pradesh politician DP Yadav, dp yadav, dehradun court, mahendra singh bhati cbi court, dehradun special CBI court, sentenced to life imprisonment, Mahendra Singh Bhati murder case., IPC section 302 (murder), IPC section 307 (attempt to murder), IPC section 120B (criminal conspiracy), Special CBI judge Amit Kumar Sirohi, Uttarakhand High Court,

Controversial Uttar Pradesh politician DP Yadav and three others were sentenced to life imprisonment by a special CBI court in connection with the 1992 Mahendra Singh Bhati murder case.

వెంటాడిన హత్యకేసు.. మాజీ మంత్రికి జీవిత ఖైదు..

Posted: 03/10/2015 06:53 PM IST
Dp yadav 3 others awarded life term

ఉత్తరప్రదేశ్ వివాదాస్పద రాజకీయ నేత, మాజీమంత్రి డీపీ యాదవ్ కు డెహ్రాడూన్ ప్రత్యేక సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించింది. 1992 సెప్టెంబర్ లో మహేంద్ర సింగ్ భట్టి, అతని స్నేహితుడు ఉదయ్ ప్రకాష్ ఆర్య దారుణ హత్యకేసులో యాదవ్ ను దోషిగా తే్ల్చిన న్యాయస్థానం ఈ మేరకు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1992లో సంచలనం సృష్టించిన ఈ జంట హత్యల కేసులో యాదవ్ తో పాటు అతని ముగ్గురు అనుఛరులు పాల్ సింగ్, కరన్ యాదవ్, ప్రణిత్ భాటిలను కోర్టు దోషులుగా పరిగణించి వారికి కూడా జీవిత ఖైదును ఖారారు చేసింది.

ఇవాళ తీర్పును వెలవరించిన డెహ్రడూన్ ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ కుమార్.. దోషులకు తలా లక్ష రూపాయల మేర అపరాద రుసం విధించడంతో పాటు జీవిత ఖైధు శిక్షను విధించారు. ఈ నేపథ్యంలో డీపీ యాదవ్, కరణ్  యాదవ్, ప్రనీ భట్టిలపై హత్య, హత్యయత్నం, కుట్రలతో పాటు వివిధ సెక్షన్ల  కింద క్రిమినల్  కేసులు  నమోదయ్యాయి. కాగా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాము ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు యాదవ్ తరపు న్యాయవాది రుపేందర్ భండారి తెలిపారు. కోర్టు తీర్పు వెలువరించడంతో డిపి యాదవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dp yadav  dehradun court  mahendra singh bhati cbi court  

Other Articles