Alligation in aap going on

aap., yogendaryadav, prashanth bhushan, kejriwal, delhi

AAP leader Yogendra Yadav welcomes party's statement saying, “Hope this statement ends all slander, planting of allegations. Hope no more coercion of party functionaries and Delhi MLAs on this issue.

అతను ఆప్ ఓడిపోవాలని ప్రయత్నించాడు

Posted: 03/10/2015 03:51 PM IST
Alligation in aap going on

రాజకీయ వ్యవస్థను కడిగివేస్తామంటూ దేశ ప్రజల ముందు వచ్చిన ఆప్ ఇప్పుడు సమస్యల సుడిగుండంలొ చిక్కుకుంది. గత కొంత కాలంగా ముదిరిన సీనియర్ నాయకుల వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటి నుండి తొలగించడం, తరువాత కొంత మంది ఆప్ కార్యకర్తలు ఆ వ్యవహారంపై ఆన్ లైన్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు వారాల నుండి ఆప్ వివాదం సాగుతూనే ఉంది. అయితే తాజాగా ప్రశాంత్ భూషణ్ తొందరలోనే నిజాలు వెలుగులొకి వస్తాయని వెల్లడించడం కొత్త చర్చకు దారి తీసింది.

అయితే పార్టీ కీలక పదవుల నుండి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను తొలగించడంపై పార్టీ లోని కొందరు వివరణ ఇస్తున్నారు. పార్టీ ఓటమికి ప్రశాంత్ భూషణ్ ట్రై చేశారని, కొందరు ఆప్ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలిచ్చారని వారు వాదిస్తున్నారు. ఆప్ కు నిధులు రాకుండా కూడా అడ్డుకున్నారని వారు అంటున్నారు. ఢిల్లీలో బిజెపి అధికారానికి రావాలని ఆకాంక్షించారని, అందుకే కేజ్రీవాల్ కు సహకరించవద్దని, అతనికి తగిన శాస్ర్తి జరగాలని ప్రశాంత్ భూషణ్ కోరుకున్నారని వారు బలంగా వాదిస్తున్నారు.

yogendertweet

కాగా ప్రశాంత్ భూషణ్ దీనిపై వివరణ ఇవ్వలేదు. తొందరలోనే అన్ని నిజాలు నిగ్గుతేలతాయని, ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయని మీడియాతో అన్నారు. మరో సీనియర్ నేత యోగూంద్ర యాదవ్ మాత్రం ప్రశాంత్ భూషణ్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదని ట్విట్టర్ లొ ట్వీట్ చేశారు. అలా సాగుతున్న ఆప్ లో లుకలుక మాత్రం అప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. మరి ఇంకేన్నాళ్లకు ఈ వివాదానికి తెర పడుతుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap.  yogendaryadav  prashanth bhushan  kejriwal  delhi  

Other Articles