Ysjagan attacks on chandrababu for balakrishna firing

balakrishna, chandrababu, jagan, firing, assembly

ysjagan attacks on chandrababu at balakrishna firing. in ap assembly jagan fire on home minister rajappa announcement.

బాలకృష్ణ కాల్పులకు చంద్రబాబుకు సంబంధం ఉందా??

Posted: 03/10/2015 12:45 PM IST
Ysjagan attacks on chandrababu for balakrishna firing

ఏపి అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వాగ్వివాదానికి దిగారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. జగన్ చంద్రబాబు నాయుడిపై ఏదో ఒక వ్యాఖ్య చెయ్యడం, దానికి వ్యతిరేకంగా టిడిపి నాయకులు స్పీకర్ పోడియం వద్దకు చేరడం మాములైపోయింది. అయితే జగన్ చంద్రబాబు నాయుడుల మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల నుండి భూములను లాక్కొని, రియల్ దందా చేస్తారా అని జగన్ ప్రశ్నించారు. దానికి తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎదురుదాడి చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందల ఎకరాల పొలాలను రైతుల దగ్గరి నుండి లాక్కున్నారని అన్నారు. ఇద్దరు నేతల మాటలతో సభ వేడెక్కింది.

రెండు వారాల క్రితం జరిగిన నరసింహారెడ్డి హత్య కేసులోఅవినాష్ హస్తం ఉందని హోంమంత్రి రాజప్ప ప్రకటించారు. అయితే జగన్ కు అవినాష్ బంధువు అవుతారని చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీ నేతల మధ్య వివాదానికి దారి తీసింది. అయితే బంధువైనంత మాత్రాన ఇలా మాట్లాడటం ఏంటని జగన్ ఎద్దేవా చేశారు. తనకు, అనతనికి ఎలాంటి సంబందం లేదని అన్నారు. గతంలో బాలక్రిష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావించారు. బాలయ్య కాల్పులకు, బాలకృష్ణ బంధువు చంద్రబాబు నాయుడికి సంబందం ఉందా అని జగన్ ప్రశ్నించారు. దాంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  chandrababu  jagan  firing  assembly  

Other Articles