Parliament houses got hot about masarat alam release

jammukashmir, Masarat Alam. release, modi, rajnathsingh,

Prime Minister Narendra Modi said in Lok Sabha on Monday that the Centre was not happy with the clarification given by the Jammu and Kashmir government over the release of Kashmiri separatist Masarat Alam.

పార్లమెంట్ ను కుదిపేసిన ఆలం విడుదల

Posted: 03/09/2015 01:34 PM IST
Parliament houses got hot about masarat alam release

కాశ్మీర్ వేర్పాట నాయకుడు ముసరాత్ ఆలం విడుదలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రశ్నల దాడికి దిగాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టాయి. దేశానికి ఎంతో కీడు చేసే ఆలంలాంటి వ్యక్తిని విడుదల చెయ్యడంపై ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాయి. అయితే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంపై  మధ్యాహ్నం తరువాత వివరణ ఇస్తామని ప్రకటించినా ప్రతిపక్షాలు నిరసన వీడలేదు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు భంగం చేస్తోందంటూ ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ లో నిరసన తెలిపారు. అయితే దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ స్పష్టం చేశారు. ఆలం పై 27 కేసులు ఉన్నాయని, వాటిలొ అన్నింటి్కి అతనికి బెయిల్ లభించిందని హోంమంత్రి వివరించారు. ఆలం విషయంపై కాశ్మీర్ నుండి వివరణ వచ్చిందని అతను పార్లమెంట్ లో ప్రకటించారు. అయితే ఏ దోషినైనా రెండు సంవత్సరాలకు మించి జైల్ లో ఉంచరాదని చట్టంలో ఉన్నట్లు రాజ్ నాథ్ వివరించారు. అయితే మొత్తం వివరాలు అందిన తరువాత కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తామని రాజ్ నాథ్ ప్రకటించారు.

అయితే జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ముసరాత్ ఆలం ను విడుదల చేస్తున్నట్లు కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ లో ప్రకటించారు. కేంద్రానికి, సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలకు కూడా సమాచారం లేదని తెలిపారు. మరో పక్క ఉగ్రవాద కార్యకలాపాలను తాను ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను తాను ఎన్నటికీ అంగీకరించనని ఆయన అన్నారు. ఆలం విడులపై వ్యక్త మవుతున్న ఆందోళనలో తాను కూడా ఒకడినని వెల్లడించారు. వేర్పాటువాదులు, ఉగ్రవాదులపై ప్రభుత్వం ఉపేక్షించదని మోదీ ప్రకటించినా, విపక్షాలు నిరసనను కొనసాగించాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammukashmir  Masarat Alam. release  modi  rajnathsingh  

Other Articles