Value added tax on telangana farmers

drip, telanagana, farmers, vat, vat tax, govt, budget, drip irrigation

value added tax on telangana farmers. telanagana govt dismiss from the VAT on drip irrigation instruments. formers have more expense on drip irrigation.

తెలంగాణ రైతాంగానికి వ్యాట్ పోటు

Posted: 03/09/2015 09:48 AM IST
Value added tax on telangana farmers

తెలంగాణ సర్కార్ రైతన్న నడ్డివిరుస్తోంది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా రైతుల నుండి ముక్కుపిండి వ్యాట్ రూపంలో పన్ను వసూల్ చేస్తోంది. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియక, అసలే అటకెక్కిన వ్యవసాయానికి తెలంగాణ సర్కార్ మరింత కుంగదీస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేస్తున్న బిందు సేద్య పరికరాల సబ్సీడిలో రైతుకు వ్యాట్ రూపంలో కొత్త కొరివి అంటగట్టింది. ఆపసోపాల మధ్య నడుస్తున్న రైతన్నలకు సహాకరించాల్సిన తెలంగాణ సర్కార్ ఇలా వారికి పన్ను పోటు పెట్టడాన్ని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరి కష్టాలు తీరతాయని అనుకుంటే, పరిస్థితి తిరగబడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆదుకుంటుందని అనుకున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీపై చేతులెత్తేసింది.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రిప్ ఇరిగేషన్ ఫలితాలు అనుకున్న స్థాయిలో రావడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా నీటి ఎద్దడి ఉంటోంది. అందుకు గాను తీవ్రంగా నీటి కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో సూక్ష్మసేద్యానికి ఎంతో అనువుగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం డ్రిప్ ఇరిగేషన్ గురించి అవగాహన పెంచుకుంటోంది. అయితే అంతలోనే తెలంగాణ సర్కార్ వారి ఆశలకు కళ్లెం వేస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ కోసం ఇస్తున్న పరికరాల్లో కేంద్రం వాటా పోను, కొంత రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అయితే అందులో వ్యాట్ కూడా ఉండేది. తాజాగా వ్యాట్ భారాన్ని భరించడానికి తెలంగాణ సర్కార్ ముందుకు రాలేదు. దాంతో ఆ భారం రైతులపై పడుతోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా డ్రిప్ పరికరాలను ఇస్తున్నాహెక్టారుకు 5 వేల చొప్పున రైతులు వ్యాట్ చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాది పదిహేను వేల మందికి పరికరాలను మంజూరు చేశారు. అందులో దాదాపు పదకొండు వేల మంది రైతులు ఇప్పటికే వ్యాట్ చెల్లించారని సమాచారం. అలా మొత్తం పది కోట్లకుపైగా వ్యాట్ చెల్లించినట్లు వివరాలు నమోదయ్యాయి. ఇలా అసలే అంతంత మాత్రం నడుస్తున్న వ్యవసాయానికి కూడా మొండిచేయిస్తే, భవిష్యత్తులో తెలంగాణలో తీవ్ర ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయం పై ఆధారపడి ఎంతో మంది జీవనోపాధిని సాగిస్తున్నారు. వ్యాట్ భారం వారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తెలంగాణ సర్కార్ రైతులకు బాసటగా నిలవాలని రైతులు కోరుతున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drip  telanagana  farmers  vat  vat tax  govt  budget  drip irrigation  

Other Articles