Pawankalyan is ours said by raghunathreddy and ravela kishore

pawankalyan, janasena, landacquisition, tour,

popular actor and Jana Sena leader Pawan Kalyan threatened to launch an agitation to oppose any forcible acquisition of land from the farmers by the Andhra Pradesh government for building a new state capital. but pawan said that he is not oppose any body. but some media persons show that pawan opposing the ap govt.

పవన్ కళ్యాణ్ కావాల్సిన వాడే..

Posted: 03/07/2015 05:59 PM IST
Pawankalyan is ours said by raghunathreddy and ravela kishore

రాజధాని గ్రామాల్లో పర్యటించి, అక్కడి ప్రజలను కలిసి వారి సమస్యలను విన్న జనసేన  అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించారు. భూములను సేకరించడం అవసరే కానీ అందుకు చిన్న రైతుల బ్రతులకు చిద్రం చెయ్యడం ఏంటని పవన్ ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంతోపాలనాధ్యక్షత కలిగిన నేత అని కితాబిస్తూనే, రైతుల పక్షాన మాట్లాడారు. అయితే పవన్ ప్రశ్నలను కొందరు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న భూసేకరణకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకం అన్నంతగా ప్రచారం చేశారు. అయితే దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. జనసేన పార్టీ ద్వారా ప్రజలకు మంచి చెయ్యాలని చూస్తున్న వారిపై ఇలాంటి వ్యంగార్థాలు తియ్యడం ఏంటని దుమ్మెత్తిపోశారు. నిర్దిష్టమైన ప్రణాళికతో పవన్ దూసుకువెళుతున్నారని వారు తెలిపారు. వపన్ పై దుష్ప్రచారం చేస్తే, ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

మరోపక్క జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తమకు కావాల్సిన వ్యక్తి అని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిశోర్‌బాబు అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏపీకి మంచి రాజధాని కవాలని కోరుకుంటున్నారని మంత్రులు చెప్పారు. ఒక్క మనిషి  23 ఎకరాల్లో ఇల్లు కట్టుకోగాలేంది... రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే రాజధాని కోసం 32వేల ఎకరాలు తీసుకోవడం తప్పా అని వారు ప్రశ్నించారు. ఏడు వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తామని, మిగిలిన భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా రైతులకు ఇచ్చి, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్రజల బాగుకోసం మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేశారని, అంతేకానే ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టంగా మీడియా ద్వారా తెలిపారు, అయినా కొందరు కావాలనే కొత్త అర్థాలు తీయడంపై వపన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawankalyan  janasena  landacquisition  tour  

Other Articles