Telugu states assembly budget sessions from today

Telugu states Assembly budget sessions begins today, Telugu states Assembly budget sessions from today, Telangana Assembly budget sessions begins today, Andhra Pradesh Assembly budget sessions begins today, Telugu desam party, TDP, YSRCP, TRS, Congress party, BJP, CPI,

Telangana and AndhraPradesh states Assembly budget sessions begins today

నేటి నుంచే తెలుగురాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు

Posted: 03/07/2015 07:56 AM IST
Telugu states assembly budget sessions from today

రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. వీటిని 27వ తేదీ వరకూ జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజాసమస్యలపై పట్టుబట్టి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదునుపెడితే.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పడం ద్వారా విపక్షాలను సమర్థంగా అడ్డుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలుగట్టిగానే కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభం కానున్న రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈనెల 12న చంద్రబాబు ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 13న వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. విభజన అనంతరం ఆర్థిక వనరులు కుదించుకుపోయి వ్యయం నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్‌లో ఎంతవరకు స్థానం కల్పిస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. క్రితంసారి ప్రవేశపెట్టిన రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్‌కు కొద్దిగా అధికంగానే బడ్జెట్ ఉండొచ్చని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. శనివారం ఉదయం 8.55 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. తిరిగి సోమవారం నుంచి వరుసగా సమావేశాలు జరగనున్నాయి.

కాగా, అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు విపక్షం కూడా కత్తులు నూరుతోంది. రాజధాని ప్రాంత రైతుల కన్నీరుతో రాజధాని కడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్దం అవుతోంది. కేవలం రియల్టర్లు లాభం చేకూర్చేందుకే రాజధాని కోసం 30 వేల ఎకరాలను సేకరిస్తున్నారని ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి అస్త్రాలను ఎక్కుపెట్టిన ప్రతిపక్ష నేత జగన్.. ఇక ప్రభుత్వంపై అసెంబ్లీలోనే ప్రశ్నలను సంధించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో పాటు రైతుల ఆత్మహత్యల విషయాన్ని కూడా ప్రస్తావించనున్నట్లు సమాచారం.

తెలంగాణ ఉభయసభలను ఉద్దేశించి శనివారం గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలో శనివారం జరిగే శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు. 11వ తేదీన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాల్లో పింఛన్లు, బీడీ కార్మికులకు భృతి పెంపు, రుణమాఫీ, అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం వంటి సంక్షేమ కార్యక్రమాలతోపాటు జలహారం, మిషన్ కాకతీయ, యాదగిరి గుట్ట అభివృద్ధి తదితర కార్యక్రమాలను సర్కారు ప్రధానంగా ప్రస్తావించనుంది.

కాగా, విపక్షాలు మాత్రం ఎన్నికల హామీలు, అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. కరవు తీవ్రత ఎక్కువగా ఉన్నా వలసలు నిరోధించడానికి తగ్గట్లుగా ఉపాధి హామీ పనులు జరగడం లేదు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాగునీటికీ అప్పుడే ఇక్కట్లు మొదలయ్యాయి. ఇలాంటి ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపాలు ప్రకటించాయి. శాసనసభ్యులు, మండలి సభ్యుల ఫిరాయింపులతోపాటు విద్యుత్తుపై కూడా వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాల్లో విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఏ మేరకు కార్యాచరణ జరిగిందని సర్కారును నిలదీసేందుకు విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly budget sessions  Andhra pradesh  Telangana  

Other Articles