Special story on aamadmiparty contraversy

aap, aamadmiparty, anna, janlokpal, prashanthbhushan, kejriwal, kiranbedi, yogendrayadav,

Yadav and Bhushan made two proposals for a compromise. First they offered to leave the Political Affairs Committee (PAC) if it was reconstituted and second they offered to stay away from the panel for a while.Prashant Bhushan had threatened revolt inside AAP

ప్రత్యేకం: ముందు వివాదాలు.. తరువాత ఆప్

Posted: 03/06/2015 05:46 PM IST
Special story on aamadmiparty contraversy

రాజకీయాల్లో కొత్త మార్పుకు మా పార్టీ అంటూ ప్రజల ముందుకు వచ్చారు కొంత మంది సామాన్యులు. అలా ఆమ్ ఆద్మీ కోసం, అవినీతిని లేకుండా చెయ్యడానికి, చెత్త రాజకీయాలను కడిగిపడేస్తామని వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. అలా పుట్టుక నుండే కొత్త ఆలోచనలతో పురుడుపోసుకొన్న పార్టలోని వ్యక్తులు కూడా అవినీతిపై సమరం జరుపుతున్న వారే. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, కొత్త రాజకీయాలకు తెరతీశారు. ఢిల్లీ నుండి ప్రారంభమైన ఆప్ ప్రస్థానం అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది.  2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ పుట్టుక నుండి అన్నింటా సంచనాలకు కేంద్రంగా మారింది ఆప్.

ఆమ్ ఆద్మీ పార్టీ ..కనీసం రాజకీయ అనుభవం లేదని కొత్త వ్యక్తులను తమ పార్టీ అభ్యర్థులుగా నిలిపి వారిని గెలిపించుకుంది. భారతదేశంలో కొత్త రాజకీయ పార్టీలు విలువలతో వస్తే స్వాగతించడానికి సిద్దంగా ఉంటారని నిరూపించారు. అయితే ఎవరూ ఊహించనంతగా మోదీ హవాను ఏమాత్రం కనిపించకుండా, పూర్తి స్థాయి కాదు కాదు భారీ స్థాయిలో గెలిపించారు. గతంలో అధికారాన్ని అప్పచెప్పినా మధ్యలో వదిలేసిన ఆప్ పార్టీకే మరోసారి పట్టంకట్టారు ఢిల్లీ ప్రజలు. కనీవినీ ఎరుగని రీతిలో అఖండ మెజారిటీతో, కనీస ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఢిల్లీ ప్రజలు.  ఢిల్లీలో అధికారాన్ని చేపట్టి పట్టుమని నెల కూడా గడవలేదు, అప్పుడే ఆమ్ ఆద్మీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి.

అన్నా హజారే ఉద్యమ సమయంలో ఆయన వెంట నడిచి, జన్ లోక్ పాల్ బిల్లును తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేసిన ఉద్యమంలో కొంత మంది సామాజిక కార్యకర్తలు ఆయనకు బాసటగా నిలిచారు. అందులో అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి ప్రముఖులు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి , స్వచ్చంద సంస్థ ద్వారా ప్రజాజీవితానికి పూనుకున్నారు. అలా ఉద్యమ నేపథ్యంలో  కలిసిన కొంత మంది సామాజిక కార్యకర్తలు కలిసి ఓ కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. అయితే కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావాన్ని అన్నాహజారే స్వాగతించలేదు. అయినా అన్నాను కాదని కొంద మంది కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని 2012లో స్థాపించారు.

అలా ఉద్యమ నేపథ్యం నుండి ఆవిర్భవించిన ఆప్ పార్టీ ఉద్యమాలనే తన అస్త్రాలుగా వాడుకుంది. కేంద్ర ప్రభుత్వంపై సమస్యలతో నిరంతర సమరానికి దిగింది పార్టీ. అలా దేశంలోని ప్రముఖ నగరాలకు విస్తరించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే కొత్త ఆలోచనలతో దూసుకువెళ్లింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రాచరంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఆ పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు దగ్గరైంది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని తమ పార్టీలో ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ, వారికే పట్టం కట్టింది. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి చేరువైంది.

పార్టీ అధికారాన్ని చేపట్టిన తరువాత పార్టీలో అప్పటి దాకా ఎంతో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు పార్టీ నాయకత్వంపై నిరసన గళాన్ని వినిపించారు. పార్టీలోని కొందరు పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అది ఎంత మాత్రం మంచిది కాదు అని పార్టీకి బహిరంగ లేఖ రాశారు. అయితే యోగేంద్ర యాదవ్ తన అసంతృప్తిని మరో లేఖలో వివరంగా వివరించారు. పార్టీలో పిఎసి వ్యవహారాలు ఏ మాత్రం మంచిగా లేవని లేఖలో వివరించారు. ప్రశాంత్ భూషణ్ ఏకంగా పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు చేశారు. పార్టీ ఏర్పాటే సమయంలో ఒకరికి ఒక పదవి మాత్రమే అన్న సిద్దాంతాన్ని మరిచి, ఆప్ కన్వీనర్ గా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇలా రెండు పదవులను చేపట్టడం ఏంటని ప్రశ్నించారు.

ఇలా పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తులు పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలకు బిన్నంగా మేము భిన్నం అని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా ఇలాంటి రాజకీయ వివాదాలు చోటు చేసుకోవడం వార్తలకెక్కింది. అయితే పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీపై విమర్శలకు దిగిన వారిని పార్టీ ము్య బాధ్యతల నుండి తప్పించారు. ఓటింగ్ లో పార్టీ కన్వీనర్ కు బాసటగా నిలుస్తు, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పార్టీ పిఎసి నుండి తప్పించారు. మొత్తానికి అరవింద్ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. అయితే కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన రాజీనామాను తిరస్కరించింది పార్టీ. కేజ్రీవాల్ ను కొనసాగిస్తు పార్టీ తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.

అయితే ఎన్నికల ప్రారంభానికి ముందే అరవింద్ కేజ్రీవాల్ కు, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లకు మధ్య విభేదాలు తలెత్తాయని కొందరు పార్టీ కార్తకర్తలు అనుకుంటున్నారు. అందుకే కేజ్రీవాల్ కీలక నిర్ణయాలను స్వంతంగా తీసుకున్నారని, వారిద్దరిని పార్టీ వ్యవహారాల్లో కాస్త దూరంగా ఉంచారని సమాచారం. అలా ఇప్పుడు పార్టీలో జరుగుతున్న వివాదానికి ఎన్నికల సమయంలోనే బీజం పడిందని తెలుస్తోంది. అలా అక్కడ ప్రారంభమైన విభేదాలు, చిలిచిలికి గాలివానగా మారాయి. అయితే పార్టీలో జరుగుతున్న వివాదాలకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లోని చాలా మంది అభిమానులు పార్టీలో విభేదాలను పక్కన పెట్టి, సామరస్యంగా ముందుకు వెళ్లాలని వినతులు చేశారు. పార్టీలో ముందు నుండి కీలకంగా వ్యవహరించిన సీనియర్లు పార్టీ సభ్యులతో కూర్చుని సమస్య పరిష్కారానికి కృషి చెయ్యాలని సూచించారు.

అయినా పరిష్కారం లభించకపోవడం గమనార్హం. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ వివాదాలకు తావిచ్చింది. పార్టీ ఇద్దరు సీనియర్లను కోల్పోయింది. అయితే పార్టీ నిర్మాణం దగ్గరి నుండి ముందున్న ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను ఏకంగా పార్టీ ప్రధాన బాధ్యతల నుండి తప్పించడం ఏంటని కొందరు కార్యకర్తలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో కొంత మంది కార్యకర్తలు ఆన్ లైన్ లో అబిప్రాయాలను సేకరించడం ప్రారంభించారు. అయితే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తరహాలోనే ఇంకా కొంత మంది పార్టీపై అసమత్తి జెండా ఎగరవేస్తారా, లేదా ఇంతటితోనే ఈ వివాదానికి తెర పడుతుందా అని ఆసక్తి నెలకొంది.

పార్టీ ఆవిర్భావం లో కేవలం విలువలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే అవినీతికి వ్యతిరేకం, అనే ఓ ముద్ర ఉండేది. కానీ తరువాత అవినీతి వ్యతిరేకి అనే ముద్రను మించి అరవింద్ కేజ్రీవాల్ చరిష్మా పెరిగింది. ఫలితంగా ఓ వ్యక్తి కేంద్రంగా పార్టీ వ్యవహారాలు నడిచాయి. ఇలా పార్టీ సిద్దాంతాల కన్నా వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత లభించడం వివాదాలకు ఆస్కారమిచ్చింది. అలా మిగితా రాజకీయ పార్టీలకు మేం భిన్నం అన్న పార్టీలు కూడా మిగిలిన పార్టీల్లానే వివాదాలకు తెర తీసింది. నిన్నటి దాకా కేవలం నీతివంతమైన పాలన మాత్రమే ప్రధానాంశంగా ఉండేది. అయితే దాని కన్నా వివాదానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ కష్టాలను తీరుస్తుందని ఎంతో నమ్మారు. ఇప్పుడ అదే పార్టీ కష్టాల కడలిలో ఉంది. ఎప్పటికి ఆప్ లో వివాదాలు సమిసి తమ కష్టాలను తీరుస్తారా అని ఢిల్లీ ప్రజలు ఎదరు చూస్తున్నారు. మరో పక్క పార్టీ లో వివాదాలు ఇలానే ఉంటాయా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. రాజకీయ పార్టీలు మాత్రం ఆప్ లో పరిణామాలను ఎంజాయ్ చేస్తున్నారు. అలా అన్నింటా ఆప్ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంది. మరి ఇంకా ఈ వివాదాల పర్వం ఎంత వరకు సాగుతుందో చూడాలి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  aamadmiparty  anna  janlokpal  prashanthbhushan  kejriwal  kiranbedi  yogendrayadav  

Other Articles