Ys jagan said that tdp didnt get even deposits in the elections

Jagan, Ysrcp, Chandrababu, Dwacra, Farmers, Elections

ys jagan said that tdp didnt get even deposits in the elections. jaganmohan reddy attacks on chandrababu naidu who is the ap cm. he said that babu cheat farmers and dwacra groups.

టిడిపికి డిపాజిట్లు కూడా దక్కవు: జగన్

Posted: 02/27/2015 09:15 AM IST
Ys jagan said that tdp didnt get even deposits in the elections

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ రెండోసారి పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచి ఘనవిజయం సాధించిందని, అదే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదని, దాంతో వారిపై వడ్డీభారం రూ. 12 వేల కోట్లు పడిందని, దీనంతటికీ కారణం బాబేనని చెప్పారు. రుణాలు మాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు ఆందోళనలో ఉన్నారని, డ్వాక్రా మహిళలు ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకు రుణాలు కట్టడానికే సరిపోతోందని అన్నారు.

రైతులకు రూ. 57 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ  కేవలం రూ. 13 వేల కోట్లే ఇచ్చారని చెప్పారు. రైతన్నలు ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన వస్తోందని వైస్ జగన్ వెల్లడించారు. రైతుల రుణాలు రెన్యువల్ కాలేదని, దాంతో వారికి పంట భీమా దక్కడవలేదని అన్నారు. ఏపీలో గత సీజన్లో వర్షాలు 36 శాతం తక్కువగా నమోదయ్యాయని, కరువు వచ్చినా చంద్రబాబు మాత్రం స్పందించరని మండిపడ్డారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Ysrcp  Chandrababu  Dwacra  Farmers  Elections  

Other Articles