Anti humantrafficking units soon in telangana

human trafficking, telanagana, cm kcr, anti humantrafficking units, she teams, railway police, teasing

telanagana government decided to stop the human tafficking. the police department and railway police jointly launch new anti human trafficking units soon in telanagana. proposals were giving by senior police officers.

మనుషుల అక్రమ రవాణాకు చెక్.. వ్యూహాన్ని సిద్దం చేసిన తెలంగాణ సర్కార్

Posted: 02/26/2015 09:53 AM IST
Anti humantrafficking units soon in telangana

మహిళలపై అకృత్యాలు , అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం పలు కొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది అందులో భాగంగా కీలక ప్రతిపాదనలు చేస్తోంది. గతంలో బస్సు ప్రయాణాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిఎం దృష్టికి రావడంతో, బస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా క్యాబిన్ ను ఏర్పాటు చేశారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీంలు తెలంగాణలో మంచి ఫలితాలనిస్తున్నాయి. అమ్మాయిలను, మహిళలను వేధించే వారికి షీటీం సింహస్వప్నంగా మారుతోంది. షీటీంల ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీజింగ్ తగ్గిందని తేలింది. దాంతో వాటిని మిగిలిన జిల్లాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభత్వం నిర్ణయించింది,

అదే తరహాలో మహళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రచిస్తోంది. అందులో భాగంగా  రైల్వే పోలీస్ ల ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఒక డీఎస్పీ, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లతో పాటు 15 మంది సిబ్బం ది ఉండే ఈ యూనిట్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంనుంచి ట్రాఫికింగ్ జరిగే మార్గాలపై నిఘా ఉంచడమే కాకుండా భారీ స్థాయిలో ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలో వివిధ అంశాలను సమీక్షించి తుది ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ముందు ఉంచుతారు. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యానిట్లు లేకపోవడం గమనార్హం.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles