Ghar vapasi to continue till conversions are banned by bjp mp yogi adityanath

Yogi Adityanath, bjp mp, Ghar vapasi, hinduism, pm modi, venkaiah naidu, govt

Firebrand BJP MP Yogi Adityanath has stoked a fresh controversy saying VHP's 'Ghar Vapasi' programme will continue unless conversions are banned and claimed India's problem was "vote bank politics fuelled by jehadi fervour".

ఘర్ వాపసీని ఆపేది లేదు బిజెపి ఎంపి: యోగి ఆదిత్యనాథ్

Posted: 02/24/2015 05:08 PM IST
Ghar vapasi to continue till conversions are banned by bjp mp yogi adityanath

మదర్ థెరిస్సా పై వివాదాలు ముగియక ముందే బిజెపి ఎంపీ ఆదిత్యానాథ్ మరో సంచలనాత్మక ప్రకటన చేశారు. దేశంలో మత మార్పిడి నిరోధక బిల్లు తీసుకువచ్చేదాకా ఘర్ వాపసి కార్యక్రమం ఆగదని తెలిపారు. కేవలం హిందు సమాజంలో మాత్రమే శాంతి ఉందని అన్నారు. దేశంలో కేవలం ఓ వర్గానికి చెందిన వారు మాత్రమే హింసకు తావిస్తున్నారని అన్నారు. చాలా కాలం క్రితం ఎంతో మంది హిందువులను బలవంతంగా మత మార్పిడి చేశారని, ఇప్పుడు తిరిగి వారిని హిందు మతంలోకి చేర్చుకుంటామని ప్రకటించారు. దేశంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున ఘర్ వాపసి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అయితే ఆదిత్యానాథ్ మాటలు కొత్త వివాదాలనికి కేంద్ర బిందువుగా మారనున్నాయి. మోహన్ భగత్ మాటల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వంతో ఎలాంటి సంబందం లేని వ్యక్తులు మాట్లాడితే, దానికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలని వెంకయ్యనాయుడు మీడియాతో ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పడు స్వంత పార్టీ ఎంపీ ఆదిత్యానాథ్ మాటలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి. అయితే దేశంలో మత కలహాలకు చోటివ్వం అని మోదీ ప్రకటనను స్వంత పార్టీనేతలే ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. దేశంలో మతపరమైన వ్యాఖ్యలు కొన్ని సామాజిక వర్గాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Adityanath  bjp mp  Ghar vapasi  hinduism  pm modi  venkaiah naidu  govt  

Other Articles