Petroleum ministry documents leak case

documents leak case, Petroleum Ministry, delhi police, reliance, petrolium documents,

Petroleum Ministry documents leak case: Delhi Police chief says five arrested, probe on. In a development that caused reverberations in political as well as corporate circles, the Delhi Police arrested two energy consultants in connection with leaking of classified documents from the Petroleum Ministry.

పెట్రో మంత్రిత్వ శాఖలో దొంగలు..దేశవ్యాప్తంగా సంచలనం

Posted: 02/20/2015 02:51 PM IST
Petroleum ministry documents leak case

పెట్రోలియం మంత్రిత్వ శాఖలో పత్రాల మాయం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పెట్రోలియం మినిస్ట్రికి చెందిన కొన్ని కీలక పత్రాలను దొంగిలించారని, వాటిని కొన్ని కార్పోరేట్ కంపెనీలకు అప్పగించారన్న వార్తలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. అయితే కొత్తగా పెట్రోలియం మినిస్ట్రి పెట్రో బావులకు సంబందించిన ఉత్వర్వులు అందులో ఉన్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంపై ఐదుగురిని అరెస్టు చేసింది.కాగా అందులో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. దాంతో రిలయన్స్ కంపెనీకి సంబందించిన వార్తలు స్టాక్ మార్కెట్ పై ప్రభావాన్ని చూపాయి. తాజాగా రిలయన్స్ షేర్ల విలువ భారీగా పతనమైంది. మొత్తానికి ఇటు స్టాక్ మార్కెట్ , అటు కేంద్రంపై  డాక్యుమెంట్ల ప్రభావం పడింది.

దేశానిని చెందిన కీలక నిర్ణయాలకు సంబందించిన డాక్యుమెంట్లు ఇలా మాయం కావడంపై ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి పెరిగింది. దాంతో స్పందించిన పోలీసులు ఘటనపై విచారణ మొదలుపెట్టారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మంత్రిత్వ శాఖలోని ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులు ఇందులో కీలకంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు ఉద్యోగులు, ఇద్దరు మద్యవర్తులు, ఓ రిలయన్స్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే డాక్యుమెంట్ల ఫోటో కాపీలు తీశారని పోలుసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే మంత్రిత్వ శాఖ కార్యాలయం శాస్ర్తి భవన్ వద్దకు ఇన్నోవా కారులో వచ్చిన కొందరు వ్యక్తులు, దాదాపు రెండు గంటలు కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర సంచలనాన్ని సృష్టించిన ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కార్పోరేట్ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తం చేశారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : documents leak case  Petroleum Ministry  delhi police  reliance  petrolium documents  

Other Articles