May janareddy remove from congress clp

janareddy, congress clp, telanagana congress, congress, diggi raja, congress incharge, telanagana opposition, telanagan assembly, trs

congress party tring to remove janareddy from telangana clp. may in the next assembly sessions congress will have new clp in. many of congress leaders complaint againist janareddy to the congress party.

సీఎల్సీ నేత పదవి నుండి జానారెడ్డికి ఉద్వాసన..?

Posted: 02/20/2015 08:44 AM IST
May janareddy remove from congress clp

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. రెంటికి చెడ్డ కావడిలా మారింది ఆ పార్టీ పరిస్థితి. తెలంగాణ ప్రకటన చెయ్యడం వల్ల ఒక ప్రాంతంలో పార్టీకి దెబ్బపడ్డా మరో ప్రాంతంలో మాత్రం లాభముంటుందని భావించిన, కాంగ్రెస్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకే పరిమిత మైంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఏకంగా పుట్టగతులు లేకుండా పోయాయి. తెలంగాణ నేతల మాటలను నమ్మి కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పుపై అధిష్టానం గుర్రుగా ఉంది. తెలంగాణ నేతల మాటలపై ఏ మాత్రం నమ్మలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్, ప్రస్థుతం తెలంగాణలోనైనా పార్టీని కొంత గాడిన బెట్టాలని అనుకుంటోంది.

అందులో భాగంగానే కాంగ్రెస్ సీఎల్పీ పదవి నుంచి జానారెడ్డికి అధిష్టానం ఉద్వాసన పలికే అవకాశముందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత జానారెడ్డి మెతకవైఖరిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ మెజారిటీ సభ్యులు ఆయన వ్యవహారశైలి పై ఆగ్రహంగా ఉన్నారని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పార్టీ పెద్దలకు నివేదించారని సమాచారం. వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ఆయన స్థానంలో కొత్త నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది
 
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలోనూ, తెలంగాణ వ్యాప్తం గా కాంగ్రెస్ నుంచి వలసలను నిరోధించడంలోనూ సీఎల్పీ నేతగా ఆయన వైఫల్యం చెందారని పార్టీ భావి స్తోంది. జానారెడ్డిని తొలగించాలంటూ డజనుమందికిపైగా ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సచివాలయం తరలింపు, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల వంటి అంశాల్లో విపక్షనేత కనీస స్థాయిలోనూ స్పందించలేదని  ఫిర్యాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles