Dgp anuragsharma propose reforms in police recruitment

DGP Anurag Sharma, Police recruitment, Heavy reforms, Police Department, Running Race

dgp anuragsharma propose reforms in police recruitment : telanagana police department trying to reforms in polce recruitment. running will be only three km and mental ability test will conduct after physical test.

పోలీస్ నియామకాల్లో మార్పులు ఇవే...

Posted: 02/19/2015 11:47 AM IST
Dgp anuragsharma propose reforms in police recruitment

తెలుగు రాష్ట్రాల్లో పోలీసు నియామకాలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక సంస్కరణలు చెయ్యాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఐదు కిలోమీటర్ల పరుగుపై పెరుగుతున్న విమర్శల కారణంగా పరుగును ఐదు కిలోమీటర్ల నుండి మూడు కిలోమీటర్లకు కుదించాలని పోలీస్ శాఖ మార్పులు చేస్తోంది. పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ తరహాలో నిర్వహించాలని కూడా అనుకుంటోంది. పోలీసు నియామకాల్లో సంస్కరణలపై డీజీపీ అనురాగ్ శర్మ కీలక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.

అభ్యర్థుల వడపోత కోసం ఇక నుంచి ముందుగానే సివిల్స్, గ్రూప్స్ పరీక్షల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. తొలుత అభ్యర్థులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో నెగ్గిన అభ్యర్థులకు మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా మెయిన్స్ మాత్రం ఆబ్జెక్టివ్ గా కాకుండా ధియరీ గా ఉండేలా చూస్తున్నారు.పోస్టుల సంఖ్యను బట్టిన మెయిన్స్‌లో నెగ్గిన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్ట్ లోరన్నింగ్ లో తగ్గింపు మినహా ఇతర ఏ మార్పులూ ఉండవు.

 పోలీసు ఉద్యోగం మానసిక ఒత్తిడితో కూడినది. సెలవులు, విశ్రాంతి లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మానసిక స్థితి బలంగా లేనివారు తీవ్ర ఒత్తిడికిలోనై సంయమనాన్ని కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశముంటుంది. ప్రధానంగా టీఎస్‌ఎస్‌పీ, ఏఆర్ విభాగాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది విధి నిర్వహణలోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడడం, ఇతరులపై కాల్పులు జరపడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉద్యోగంలో చేరకముందే అభ్యర్థుల్లోని మానసిక బలం, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై మానసిక నిపుణులతో పరీక్షలు జరిపించి పరిశీలించనున్నారు. ఫిజికల్ టెస్ట్ తర్వాత అభ్యర్థులకు మానసిక పరీక్షలు నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DGP Anurag Sharma  Police recruitment  Heavy reforms  Police Department  Running Race  

Other Articles