Us alabama governor robert bontley apologise indian consulate general indian residence patel

alabama governor robert bontley, indian residence patel paralysed, indian residence patel us police controversy

us alabama governor robert bontley apologise indian consulate general indian residence patel

భారతీయుడికి క్షమాపణ చెప్పన యూఎస్ గవర్నర్..

Posted: 02/18/2015 03:14 PM IST
Us alabama governor robert bontley apologise indian consulate general indian residence patel

ఇటీవలే తన కొడుకును చూడ్డానికని అమెరికాకు వెళ్లిన పటేల్ (57) అనే వ్యక్తిపై అక్కడి పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే! ఇంగ్లీస్ రాని అతగాడు తన గురించి వివరించడానికి ప్రయత్నించిన తరుణంలో కాస్త తడబడ్డాడు. అంతే! అతడు దుండగుడేమోనని భావించి పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా అతడిని నేలమీదకి పడేసి తమకిష్టమొచ్చినట్లుగా కొట్టారు. అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లోనూ అతనిని కొట్టారు. వారి దెబ్బలను భరించలేకపోయిన పటేల్.. చివరికి పక్షవాతంతో ఆసుపత్రిపాలయ్యాడు.

అతనిపై అంత దారుణంగా ప్రవర్తించడంపై అమెరికాలని భారతీయులు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ చర్యకు పాల్పడిన పోలీసులపై చర్య తీసుకోవాలంటూ వాళ్లు నిరసన చేపట్టారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ఈ విషయంపై స్పందించిన అమెరికాలోని అలబామా గవర్నర్ రాబర్ట్ బెంట్లే.. తనను క్షమించాలంటూ వేడుకున్నారు. తమ దేశానికి వచ్చిన అతిథిపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించడాన్ని ఒక దురదృష్ణ ఘటనగా అభివర్ణించిన ఆయన.. అందుకు బాధితుడికి క్షమాపణ చెప్పాలి. తమ పోలీసుల చర్య తప్పేనని ఆయన అంగీకరించారు.

అలాగే.. ఈ ఘటనపై ఎప్.బీ.ఐ విచారణ ప్రారంభం అయిందని, తన క్షమాపణను అంగీకరించాలంటూ ఇండియా కాన్సులేట్ జనరల్ కు రాసిన లేఖలోనూ రాబర్ట్ కోరారు. దీంతో అక్కడి భారతీయ సంఘాలు కాస్త శాంతించాయి. మరోవైపు.. పటేల్ పై విరుచుకుపడ్డ పోలీసులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alabama governor robert bontley  indian residence patel paralysed  

Other Articles