Suicide prevention app america broome county national suicide prevention lifeline

suicide prevention app, hope mobile application, america broome county, android mobile applications, mobile applications, iphone apps, hope app, suicide app

suicide prevention app america broome county national suicide prevention lifeline : America broome county introduced a new mobile application hope which helps to prevent suicide.

’ఆత్మహత్య‘లను నివారించే మరో కొత్త మొబైల్ ‘యాప్’!

Posted: 02/18/2015 01:20 PM IST
Suicide prevention app america broome county national suicide prevention lifeline

ఇటీవలేకాలంలో ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఈ విషయంపై ఆమధ్య ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సూసైడ్ శాతం భారీగా పెరిగిపోయిందని తేల్చి చెప్పింది. ఇందులో చాలావరకు గృహిణులు, విద్యార్థులే వున్నారని పేర్కొంది కూడా! తీవ్ర మానసిన ఆవేదనకు గురవుతున్నవాళ్లే తమనుతాము హతమార్చుకుంటున్నట్లు తెలిసింది! అందుకేనేమో.. ఈ ఆత్మహత్యలను నివారించేందుకు కొందరు నిపుణులు సరికొత్త ‘యాప్’ను ఆవిష్కరించారు.

ఇప్పటికే ఆవిష్కరించబడ్డ లెక్కలేనన్ని మొబైల్ అప్లికేషన్ల ప్రపంచంలోకి మరో కొత్త యాప్ రంగప్రవేశం చేసింది. దాని పేరు ‘హోప్’. ఇది ఆత్మహత్యలను నివారించడానికి ఉపయోగపడుతుందని రూపకర్తలు అంటున్నారు. ఓ చెక్ లిస్టు సాయంతో వ్యక్తుల మానసిక స్థితిని అంచనావేయడం ద్వారా వారిలో మెదులుతున్న ఆత్మహత్య సూచనలను ఈ యాప్ పసిగడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిప్రెషన్ లో వున్నవారిని గుర్తించి, వెంటనే వారిని నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్ లైన్ కి అనుసంధానిస్తుంది. ఫలితంగా ఆయా వ్యక్తులకు సరైన సమయంలో కౌన్సెలింగ్ లభిస్తుందని చెబుతున్నారు.

ఈ సరికొత్త యాప్ ని అమెరికాలోని బ్రూమ్ కౌంటీ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో దీనిని ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ సమాచారం మొత్తం నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్ లైన్ అధీనంలో వుంటుంది. ఈ యాప్ అందించే ప్రతిసమాచారాన్ని ‘లైఫ్ లైన్’ విశ్లేషించి.. అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది. మరి.. ఈ యాప్ ద్వారా ఎంతమంది ఆత్మహత్య చేసుకోకుండా బయటపడతారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suicide prevention app hope  mobile applications  broome county  

Other Articles