Isis burned 45 members al baghdadi as islamists attack

isis attacks, isis burned 45 members, al baghdadi islamic state, islamic states, iran iraq controversy, muslim states, isis controversies

isis burned 45 members al-Baghdadi as Islamists attack : ISIS burn 45 people to death in captured Iraqi town of al-Baghdadi as Islamists attack the homes of security forces' families

ISIS పైశాచికత్వం.. 45 మందిపై పెట్రోలు పోసి నిప్పింటించేశారు

Posted: 02/18/2015 11:40 AM IST
Isis burned 45 members al baghdadi as islamists attack

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారుణాలు రానురాను మరింతగా పెచ్చుమీరిపోతున్నాయి. ఆనాడు ఓ పైలట్ ను సజీవదహనం చేసి సంచలనం చేపిన ఐసిస్.. మొన్నటిమొన్న 21 మందిని మోకాళ్లపై కూర్చోబెట్టి తలలు తెగ్గొట్టేశారు. ఇప్పుడు మళ్లీ ఏకంగా 45 మందిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశారు ఈ కిరాతకులు! 45 మందిని బంధించి, వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా తెలిసింది.

ఈ ఘటన పశ్చిమ ఇరాక్ లోని అల్-బాగ్దాది పట్టణం సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారని ఓ ప్రముఖ వార్తాసంస్థ తెలియజేసింది. వీరిలో కొందరు సైనికులని, మరికొందరు జర్నలిస్టులు వున్నారని తెలుస్తోంది. అయితే.. వీరిని దహనం చేసినట్లుగా ఇంతవరకూ ఏ వీడియోగానీ, ఫోటోగానీ విడుదల కాలేదు. వీరిని ఈ విధంగా సజీవదహనం చేయడానికి గల కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis burned 45 members  isis controversies  

Other Articles