Railway tte misbehaved with techie been suspended

railway tte misbehaved with techie been suspended, railway tte misbehaved suspended, railway tte misbehaved at ongole, Prakasam district, TTE gangaiah, Sriramulu, gangaiah suspended from duties,

Railway TTE allegedly misbahaved with a woman software engineer at Ongole in Prakasam district has been suspended

తగిన శాస్తి.. విధుల నుంచి రైల్వే టీటీఈ సస్పెండ్..

Posted: 02/17/2015 04:47 PM IST
Railway tte misbehaved with techie been suspended

ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టిక్కెట్ కలెక్టర్ గంగయ్యను సస్పెండ్ చేస్తూ సీనియర్ మండల వాణిజ్య అధికారి శ్రీరాములు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీసీపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణకు ఏసీఎం ఆలీఖాన్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించారు.

గుంటూరుకు చెందిన పాతికేళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆదివారం రాత్రి తన భర్త, తండ్రితో కలిసి గుంటూరు రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆమె ఉద్యోగం చేస్తున్న చెన్నైకు వెళ్లేందుకు 12604 హైదరాబాద్- చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రకారం ఏసి కంపార్ట్‌మెంటులో వెయిటింగ్‌లిస్టు వచ్చింది. దీంతో ఆమెతోపాటు భర్త, తండ్రి బి -1 కోచ్ టిటిఇ గంగయ్యను బతిమిలాడి బెర్త్ ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించి అంత వరుదాకా తన సీటులో కూర్చోమని చెప్పాడు. జాగ్రత్తగా చెన్నైలో దించుతానని వారికి హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. రైలు చినగంజాం వచ్చిన తర్వాత బెర్త్‌లో ఆమె పక్కకు చేరి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

దీంతో టిటిఇ చర్యల్ని ఆమె ప్రతిఘటించి అక్కడే ఉన్న బాత్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని తన భర్తకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించింది. ఆమె భర్త వెంటనే రైల్వేకంట్రోల్ రూంకు ఫోన్‌చేసి చెప్పటంతో పాటు ఒంగోలు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో రైలు ఒంగోలు చేరుకునే సరికి రైల్వే పోలీసుస్టేషన్ ఎస్‌ఐ భావన్నారాయణ టిటిఇ గంగయ్యను కూడా పిలిపించారు. గంగయ్య వద్దనుండి ఐడి కార్డును తీసుకుని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం నెల్లూరు రైల్వేపోలీసు స్టేషన్ సిఐ విజయకుమార్‌కు అప్పగించారు. సిఐ విజయకుమార్ టిటిఇ గంగయ్యను అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చినట్లు చెప్పారు. ఇటు రైల్వే అధికారులు కూడా గంగయ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : techie  software engineer  Prakasam  

Other Articles