South actress manorama death news bhupathi clarity gossips

manorama death news, south actress manorama death news, manorama son bhupathi news, manorama movies, tollywood manorama news, bollywood manorama death news, south industry gossips

south actress manorama death news bhupathi clarity gossips : In the recent days the gossips went on social networking sites that actress manorama died. But her son bhupathi clarity that now she is fine and curing from unhealthy position.

బతికేవున్న నటి మనోరమను చంపేసిన పుకార్లు...

Posted: 02/16/2015 02:56 PM IST
South actress manorama death news bhupathi clarity gossips

దక్షిణాది సినీరంగంలో వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటిగా పేరొందిన మనోరమ మరణించారన్న వార్తలు జోరుగా సాగాయి. వరుసగా సినిమాలు చేసుకుంటూపోతున్న ఈమె.. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ వార్తలు వెలువడ్డాయి. పైగా ఆమధ్య ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా సమాచారాలు కూడా అందాయి. ఇక అప్పటినుంచి ఈమె ఎక్కడా కనిపించలేదు. అంతే! ఈమె చనిపోయినట్లుగా మీడియాలు ప్రచారాలు మొదలయ్యాయి. ఈమె చనిపోయిందన్న వార్తలతో సినీరంగం సైతం ఆశ్చర్యపోయింది.

ఇంతకు ఆమె మరణించిందా..? లేదా..? అన్న విషయాన్ని స్పష్టం చేసుకోవడం కోసం సినీప్రముఖుల ఒకర్నొకరు సంప్రదించుకోవడం మొదలుపెట్టేశారు. చివరికి ఈ వదంతులు మనోరమ కుమారుడు భూపతికి చేరింది. ఇక అప్పుడు అసలు విషయం బయటపడింది. చాలాకాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నిజమేనని చెప్పిన ఆయన.. తన తల్లి (మనోరమ) క్షేమంగానే వున్నారని స్పష్టం చేశారు. ఆమె చనిపోయినట్లుగా వచ్చిన వదంతులు ఎలా వ్యాపించాయో తమకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ వార్తల్లో వాస్తవం లేదనీ, ప్రస్తుతం ఆమె క్షేమంగానే వుందని ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా.. కొన్నాళ్లక్రితం బాలీవుడ్ కి చెందిన మనోరమ అనే నట మరణించారు. ఆ వార్తే ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారమవుతూనే వుంది. అలా ఆ వార్తలు రావడం వల్లే దక్షిణాది నటి మనోరమ మరణించిందని పొరపాటు పడి వుంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైతేనేం.. ఈమె క్షేమంగానే వున్నారన్న వార్తతో దక్షిణాది ఇండస్ట్రీ హ్యాపీగా ఫీలవుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles