Big beasts scrap for an hour in brutal battle to the death

Zambia's South Luangwa National Park, lion deas in forest, lion buffalo both got dreadful injuries., lion clawed his prey, the buffalo refused to retreat, buffalo goring lion with horns, Matt Armstrong-Ford, Eastbourne in East Sussex, Shenton Safaris guide and camp manager, Matt Armstrong-Ford spotted bloody battle.

Big beasts scrap for an hour in brutal battle to the death

ITEMVIDEOS: సింగిల్ గా వస్తే.. సింహానికి చావు తప్పలేదు..

Posted: 02/14/2015 12:24 AM IST
Big beasts scrap for an hour in brutal battle to the death

సింహం.. సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి’ అన్నది సినిమా డైలాగ్. కానీ.. సింగిల్ గా వచ్చినా.. గుంపులుగా వచ్చినా.. అడవికి రాజులుగా వున్న హోదాను సింహాలు గత కొంత కాలంగా కొల్పోతున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలోని ఓ చెరువు తీరం వద్ద ఏడాది వయస్సున్న గజరాజు.. మృగరాజుల గుంపును తప్పించుకుని వెళ్లగా, తాజాగా మహీషి చేతిలో చిక్కిన సింహం అసువులు బాసింది.

ఇటీవల జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో గంట సాటు  మృగరాజు, గేదె ల ఈ భీకర పోరాటం చోటుచేసుకుంది. రెండు పెద్ద జంతువుల మధ్య పోరుతో అడవిలోని మృగాలు, పక్షులు భీతిల్లిపోయాయి. చాలా ఆకలితో ఉన్న ఆరేళ్ల మగ సింహం.. నీళ్లు తాగేందుకు వచ్చిన అడవి గేదెల మందపై కన్నేసింది. ఒంటరిగా మిగిలిన గేదెపైకి దూకింది. అయితే, పారిపోవడానికి బదులుగా ఎదురుతిరిగిన గేదె సింహంతో తలపడింది. పది నిమిషాల పాటు పోరు సాగింది. రెండు కొద్ది సేపు నిలిచిపోయాయి. మళ్లీ సింహం పంజాతో విరుచుకుపడగా, గేదే దాని కొమ్ములతో సింహాన్ని పెకైత్తి కుమ్మేసింది.

మళ్లీ కొద్ది సేపు రెండు నిలిచాయి. ఇలా వీటి మధ్య దాదాపు గంటసేపు పోరాటం సాగింది. రెండూ తీవ్రంగా గాయపడ్డాయి. ఈ పోరును పోదల మాటు నుంచి తొంగి తొంగి చూస్తున్న మిగిలిన గేదల్లోంచి మరో గేదే మృగరాజుతో పోరాడిన గేదకు సాయంగా వచ్చింది, సింహాన్ని తన కొమ్ములతో ఎత్తి కుమ్మేసింది. తీవ్రంగా గాయపడిన సింహం పొదల్లోకి పారిపోయింది. రెండు రోజుల తర్వాత సింహం చనిపోయింది. పార్కులో సఫారీ గైడ్‌, క్యాంపు మేనేజర్ గా పనిచేసే ఆర్మ్‌స్ట్రాంగ్-ఫోర్డ్ అనే వ్యక్తి ఈ పోరు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lion  buffalo  hour long battle  lion dead  

Other Articles