Most expensive marriage with 100cr hinduja mahanthi

100 cr wedding, hinduja wedding, designer mahanthi, jennifer lopez at indian marriage, nicole at indian wedding, udaipur wedding

The wedding, which will take place in Udaipur district of Rajasthan, The preparations for which have already begun, where in a recent event held in Mumbai, several film stars, politicians and industrialists were seen in attendance.

పెళ్లి ఖర్చు 100 కోట్లు...జెన్నీఫర్, అక్షయ్, మలైకా అరోరా మెరుపులు

Posted: 02/13/2015 01:48 PM IST
Most expensive marriage with 100cr hinduja mahanthi

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలని మన పందిరి ఊరంతా మెచ్చుకొనే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి అని మన తెలుగు సినమాలో పెళ్లి గురించి చెబుతుంటారు. పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు పెళ్లి చేసుకుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ పెళ్లి ఖర్చు వంద కోట్లట. పెళ్లికి వంద కోట్లు అవసరమా అని అనుకోకండి, వారి స్థాయికి అది సరిపోతోంది. ఇంతకీ ఎవరిదీ పెళ్లి, ఎక్కడ, ఎంత ఖర్చైంది లాంటి అన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

సంజయ్ హిందుజా మరియు ప్రముఖ డిజైనర్ అను మహంతి పెళ్లి వేడుకలు స్వర్గంలో జరిగే పెళ్లి అంటే ఇలా ఉంటుందా అన్నట్లు జరిగింది. జైపూర్ లోని ఉదయ్ పూర్ కోటలో మూడు రోజుల పాటు సాగిన పెళ్లి వేడుకలకు బాలీవుడ్, హాలివుడ్ స్టార్స్ హాజరై కలర్ ఫుల్ గా తయారు చేశారు. జెన్నిఫర్ లోపేజ్ కోసం అత్యంత ఖరీదైన  ఒబెరాయ్ ఉదయ్ విలాస్ లోని కోహినూర్ సూట్ ను బుక్ చేశారు. ఒక్క రోజుకు దీని అద్దె మూడు లక్షలట. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పెళ్లిలో సందడి చేశారు. జెన్నిఫర్ లోపేజ్ పెళ్లికి ఆకర్షనగా నిలిచారు. ఇఖ పెళ్లి కొడుకు వేసుకున్న సూట్ అందరిని ఆకర్శించింది. మొత్తం ఎనిమిది వందల మంది అతిథులతొ కూడిన ఈ పెళ్లి అందరంగ వైభవంగా సాగింది.

గుండె మారి ఎంట్రి..ఔర్ దిల్ మే భజీ గంటి అంటూ రన్వీర్ కపూర్, అర్జున్ కపూర్ చేసిన డ్యాన్స్లు అందరిని ఉర్రూతలూగించాయి. మలైకా అరోరా వేసి స్టెప్పులకు అతిథుల నుండి భారీ స్పందన వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్  అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, ప్రీతిజింటా, రవీనా టండన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇలా చాలా మంది ఈ పెళ్లికి హాజరయ్యారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పెళ్లిలో తీసుకున్న ఫోటోలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

హాలీవుడ్ స్టార్స్ జెన్నిఫర్ లోపేజ్, నికోలే షెర్జింజర్లు తళుక్కుమన్నారు. జెన్నిఫర్ పాటలతో అందరిని మైమరిపించింది. నికోలే షెర్జింజర్ చీర కట్టుతో అందరిని కట్టపడేసింది. ఇలా మూడు రోజుల పాటు సాగిన పెళ్లి వేడుకల గురించి సెలబ్రెటిలు ట్వీట్టర్ లో తమ అనుభవాలను తెలిపారు. అద్భుతం అని కొందరంటే, ఇప్పటి వరకు నేను చూసిన అతి పెద్ద పెళ్లి వేడుక అంటూ పోస్ట్ చేశారు మరి కొందరు. ఈ ఏడాదిలో ఇంత భారీగా జరిగిన మొదటి పెళ్లి  వేడుకగా సంజయ్ హిందుజా మరియు ప్రముఖ డిజైనర్ అను మహంతి పెళ్లి నిలుస్తోంది.  మరి ఇంత హడావిడికి ఆ మాత్రం ఖర్చై ఉంటుందంటున్నారు సినీ వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles