Ministers and officials are not support to chandrababu naidu

ap cm, cm chandrababu, ap ministers, kcr, ts govt, ts new rules

ministers and officials are not support to chandrababu naidu : ap ministers and officials didnt cooprerate with the cm naidu. naidu struggle for the growth of ap but its not getting results.

ప్రత్యేకం: ఎవరికి వారే యమునా తీరే....అన్నట్లుగా ఏపి లో పాలన

Posted: 02/12/2015 11:30 AM IST
Ministers and officials are not support to chandrababu naidu

చంద్రబాబు నాయుడు..ఆధునికరణకు చిరునామా, హైటెక్ ఆలోచనలతో ముందుకు దూసుకెళ్లే ధీశాలి. రాజకీయాల్లో తల పండిన చాణిక్యుడు. రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లోనూ ఎంతో పట్టున్న జాతీయ నేత. ఇప్పుడు రెండుగా చీలిన తెలుగు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రానికి దిక్సూచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసే లీడర్ చంద్రబాబే అని అక్కడి ప్రజలు నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ది చేసే సత్తా ఒక్క చంద్రబాబే అని వారి నమ్మకం. అయితే రాష్ట్ర పరిస్థితి మాత్రం ప్రజలు ఊహించినంత వేగంగా జరగడం లేదు. క్రియాశీలంగా పని చెయ్యాల్సిన ప్రభుత్వ విభాగాలు ముభావంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ప్రత్యేక కథనం...

తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నపుడు, రాష్ట్రానికి అభివృద్ది బాటలు వేసి, ప్రపంచ స్థాయికి తీసుకువచ్చారు చంద్రబాబు. తొమ్మిది సంవత్సరాల తన పాలనలో ఎన్నో కీలక సంస్కరణలు చేశారు. వ్యవస్థల్లో పూర్తి స్థాయి మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వ విభాగాలన్నింటిని ఒక గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాలన ఇప్పటికీ ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఆ పాలనను నమ్మి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టారు. అయితే చంద్రబాబు మార్క్ పాలన మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. పాలనలో మార్పులు చేసి, అన్ని విభాగాలను కోర్డనేట్ చేయాల్సిన చంద్రబాబు ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వెయ్యలేదు. అన్ని రకాలుగా తనకు సహాయపడుతుందని నమ్మిన మంత్రి మండలి మరీ దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

మంత్రి మండలిలోని చాలా మంది మంత్రులు ఇప్పటికీ తమ శాఖపై పూర్తి స్థాయిలో పట్టుసాధించలేదు అంటేనే పరిస్థితి అర్థమవుతుంది. కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి చంద్రబాబు ఒక్కడే కష్టపడుతున్నారని, మంత్రి వర్గం, అధికారులు మాత్రం ఎలాంటి సహకారాన్ని అందించడంలేదని కొందరు అధికారులు కుండబద్దలుకొడుతున్నారు. గతంలో చంద్రబాబు మంత్రి వర్గంలోని మంత్రులు పాలనపై పూర్తి స్థాయిలో పట్టుకలిగి ఉండేవారని, చంద్రబాబు ప్రమేయం లేకుండానే స్వంత నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో డైనమిక్ గా వ్యవహరించారని, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని కొందరు సీనియర్ అధికారుల మాట. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రి వర్గంలో చాలా మంది కొత్త వారు కావడంతో అనుభవం, కనీస అవగాహన లేకపోవడంతో పాలన పరుగులు పెట్టడం లేదు.

రాష్ట్రానికి సంబందించి దేశ దేశాలు తిరిగి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న చంద్రబాబు ప్రయత్నానికి ఎలాంటి ఫలితాలు రావడం లేదు. ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ చేస్తున్న చంద్రబాబు కృషికి అధికారుల సహకారం లోపించింది. ఫలితంగా పెట్టుబడులు అనుకున్న వేగంగా, అనుకున్న స్థాయిలో రావడం లేదు. కొంత మంది అధికారులు ఒప్పందాలపై కావాలనే తాత్సారం చేస్తున్నారని విమర్శ. అయితే అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినా మార్పు రావడం లేదు. కొంత కాలంగా జరిగిన ఉద్యమం తాలూకు ప్రభావాలు ఇంకా వీడలేదని కొందరి భావన. ఉద్యమం నుండి బయటకు వచ్చి ఎప్పుడు అభివృద్దిని ఉద్యమంలా నడుపుతారో చూడాలి.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగుల మీద తీసుకున్న చర్యలు ఇప్పటికీ ఉద్యోగుల వ్యతిరేకి అన్న అపవాదును కట్టబెట్టింది. అందుకే ఈ సారి ఎలాంటి తప్పులకు తావివ్వకూడదని భావిస్తున్నట్లున్నారు. అందుకే అధికారులు తప్పులు చేస్తున్నా ముందులా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న కానుక పై విమర్శలు వచ్చాయి. అధికారులు ఆఖరు క్షణంలో సరుకుల కోసం చర్యలు తీసుకున్నారని అపవాదు. అయితే సంబందిత మంత్రి సునీత మాత్రం తన శాఖలో జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. మొత్తానికి మంత్రి వర్గంలోని ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరూ ఉత్సవ మూర్తులుగా మారారని అధికారలే గుసగుసలాడుతున్నారు.

రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చంద్రబాబు పదేపదే అంటున్నా ఎవరూ ఆ బాధ్యతను గుర్తించడం లేదు. గతంలో లాగా ఒంటెద్దు పోకడలకు దూరంగా ఉండాలని చంద్రబాబు అనుకున్నా, అధికారులు, మంత్రులు దానికి సహకరించడం లేదు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలకు చెందిన అంశాలపై వేగంగా స్పందిస్తోంది. పైగా కెసిఆర్ అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహిస్తు, కార్యకలాపాలకు వేగం పెంచుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ లోనే ఆ రాష్ట్ర ముఖ్య విభాగాల కార్యాలయాలు ఉండడం కూడా ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ బండిని ప్రగతి పథాన నడిపించాలంటే ఒక్క చంద్రబాబు మాత్రమే కష్టపడితే సరిపోదు అందరి సహకారం అవసరం. చంద్రబాబు చేస్తున్న కృషికి అక్కడి అధికారులు, మంత్రులు అన్ని రకాలుగా సహకరించి రాష్ట్రాభివృద్ది సాధించాలని కోరుకుందాం.
 
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cm  cm chandrababu  ap ministers  kcr  ts govt  ts new rules  

Other Articles