Ap capital with all facilities

ap capital, new capital, ap cm, chandrababu naidu, land pulling for capital, capital with all infrastructure

ap capital with all facilities : ap capital with all facilities. in india may be aps capital first smart capital. chandrababu colabarate with singapur and japan.

ప్రత్యేకం : ఏపి రాజధాని..తెస్తుంది కొత్త ఠీవి

Posted: 02/10/2015 03:48 PM IST
Ap capital with all facilities

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి, రాజధాని లేకుండా ఏర్పడింది ఏపి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని దేశంలోనే అద్భుతంగా తీర్చదిద్దనున్నారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను కూడా తీర్చేందుకు వీలుగా దాదాపు రానున్న 30 సంవత్పరాల వరకు అన్ని అవసరాలను తీర్చేలా రాజధాని నిర్మాణం ఉండబోతోంది. రాజధాని నిర్మాణంతోనే రాష్ట్ర అభివృద్ది ముడిపడి ఉందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నట్లు, ఇదే విషయంపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కొనసాగుతోంది. కొత్త రాజధానిని 7,068 చదరపు కిలో మీటర్ల పరిధిలో నిర్మించాలనుకున్న ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకువచ్చింది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 58 మండలాలను రాజధాని పరిధిలోకి తీసుకున్నారు. ఈ భూమి రైతులు, ప్రజల నుండి తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది. అధికారులు గత కొన్ని రోజులుగా గ్రామాల్లోనే ఉంటూ ప్రజలకు రాజధాని నిర్మాణ అవసరాలను వివరిస్తున్నారు.

ఏపీ కొత్త రాజధానిని దేశంలోనే మొదటి స్మార్ట్ రాజధానిగా నిర్మించాలని ప్రయత్నిస్తోంది. అన్ని రకాల సదుపాయాలను కలిగి దేశంలోని మిగతా రాజధానులకు ధీటుగా, వేగంగా అభివృద్ది చెందే విధంగా ఎపి రాజధానిని నిర్మించడానికి కావలసిన సన్నాహాలు చేస్తోంది. దాదాపు ఎనిమిదిన్నర లక్షల జనాభా ఉండే రాజధానిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ భవనాలు, నివాస గృహాలు ఉంటాయి. కొత్త రాజధానిలో చాలా మంది నిరుద్యోగులకు  ఉద్యోగాలు దొరికే విధంగా డిజైన్ చేశారు. 40 నుంచి 50 శాతం ఉద్యోగాలు లభించనున్నాయి.

సింగపూర్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపిన చంద్రబాబు రాజధాని నిర్మాణంలో వారి తో కలిసి పని చెయ్యనున్నారు. సింగపూర్ తో పాటు జపాన్ లాంటి చాలా దేశాల సహకరారంతో ఎంతో వేగంగా, అద్భుతంగా రాజధాని నిర్మాణం జరగబోతోంది. ఇప్పటికే ప్రభుత్వం- ప్రభుత్వ సహకార పద్దతిలో నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని చంద్రబాబు వివధ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నారు. హాస్పిటల్స్, ఫైర్‌ స్టేషన్లు, కమర్షియల్‌ జోనులు, స్కూళ్లు, కాలేజీలు,  స్మశాన వాటికలు, ప్లానెటోరియంలు, కల్చరల్‌ సెంటర్లు, లైబ్రరీలు, మ్యూజియంలు, ఫిల్మ్ సిటీ, జూపార్కులు, టూరిజం పార్కులు.. ఇలా రాజధాని అన్ని అవసరాలను తీర్చేవిధంగా రూపుదిద్దుకోనుంది. నిపుణుల పర్యవేక్షణలో 2019 వరకు రాజధాని మొదటి దశ పూర్తి కానుంది.

మొత్తానికి అన్ని హంగులతో కూడిన నూతన రాజధాని రానున్న 30 సంవత్సరాల వరకు అన్ని రకాల అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులను విడుదల చేస్తే కానీ రాజధాని విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles