Aap cleans bjp

aap, delhi elections 2015, delhi updates, delhi politics, aap in leader, aap form govt.

aap clens bjp in delhi elections. from the first round aap leads till the result aap leads in 63 of 70 seats. bjp leads in only 6. aap leaders celebrates the victory of their party.

కమలాన్ని ఊడ్చేస్తున్న చీపురు

Posted: 02/10/2015 10:38 AM IST
Aap cleans bjp

ఢిల్లీలో కేజ్రీవాల్ క్రేజ్ చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ లేక కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్, ఈ ఎన్నికల్లో మాత్రం అధికారంలోకి రావడానికి కావలసిన స్పష్టమైన, ఊహించని ఫలితాలనిచ్చారు. ముందు నుండి దూసుకెళుతున్న ఆప్ బీజేపీ అంచనాలను తలకిందులు చేసింది. కనీసం పోటీపోటీగా సాగుతుందని ఊహించిన బీజేపీకి అనుకోని పరిస్థితి ఎదురవుతోంది. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ 63 స్థానాల్లో ముందంజలో ఉండగా, భాజపా 6 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. 

ఎన్నికల  ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో  ఆప్ కు స్పష్టమైన మెజార్టీ వస్తుందని తేలింది. దాంతో ముందు నుండి ఆప్ కార్యకర్తల్లో, నాయకుల్లో ఆనందం తొనికిసలాడింది. వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తు ఫలితాలు ఆప్ కు బంపర్ మెజార్టీ దిశగా సాగుతున్నాయి. దాదాపుగా ప్రభుత్వ ఏర్పాటు ఖరారైనా, ఎన్ని సీట్ల ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi elections 2015  aap  delhi updates  aam admi party  delhi politics  aap in leader  

Other Articles