Ap cm decided to raise the electricity charges jagan oppose that

electricity charges hike, ap govt, jagan

ap cm chandra babu naidu decided to raise the electricity charges. opposition leader jagan oppose to raise of electricity prices.

చంద్ర 'బా...బోయ్' షాక్ అంతే మరి!

Posted: 02/06/2015 05:37 PM IST
Ap cm decided to raise the electricity charges jagan oppose that

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర లో తొలి షాక్ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ఎపి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల స్వంత పార్టీలోనే వ్యతిరేక గానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష నేతలకైతే చేతినిండా పని. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న జగన్ కు ఛార్జీల పెంపు బలమైన ఆయుధం. రాష్ట్ర విభజన తరువాత తీవ్ర కరెంట్ కష్టాలను ఎదుర్కొంటోంది తెలంగాణ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి కష్టాలేం లేవు. పైగా అక్కడ మిగులు విద్యుత్ ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఇలా కరెంట్ ఛార్జీలను పెంచడం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం నేతలు మాత్రం ఈ విషయాన్ని మరోలా విశ్లేషిస్తున్నారు.

నిరుపేదలకు ఎలాంటి నష్టం లేదు...కేవలం విద్యుత్ ను అధికంగా వాడుతున్న బడాబాబులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వారు అంటున్నారు. బాబు గారు ఇలా షాక్ ఇవ్వడం ఇదేమీ తొలిసారీ కాదు అలాగని ఆఖరిసారీ కాదు అంటున్నారు వామపక్ష నేతలు. అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా ఇంత వరకు  షాక్ ఇవ్వకపోవడమే ఆశ్చర్యమంటున్నారు మరికొందరు. కాగా పెంచిన విద్యుత్ ఛార్జీల నుండి ఐటి రంగానికి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు బాబు ప్రకటించారు. ఐటి రంగంపై మరోసారి తన ప్రేమను చూపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cm  electricity charges hike  oppostion leader jagan  

Other Articles