Sebi dissmiss agrigold schemes cid interagation is going on

agri gold, sebi dismisses, agri gold managment, customers of agri gold, agri gold agents

sebi dissmiss agrigold schemes. cid interagation is going on.: agri gold managment failed to return the customers amount. rbi serious on agri gold. agri gold didn't have the permission to banking services. now sebi decided to dismiss all agri gold schemes.

అగ్రి 'గోల్డ్' గో..గో

Posted: 02/06/2015 04:59 PM IST
Sebi dissmiss agrigold schemes cid interagation is going on

అగ్రిగోల్డ్...కస్టమర్ల గుండెల్లో కలవరపెడుతున్న పేరు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహణ, లక్షల మంది కస్టమర్ల డబ్బును సేకరించి, వాటిని తిరిగి చెల్లించడంలొ మాత్రం తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. గత కొంత కాలంగా కస్టమర్లు తిరగబడడంతో అగ్రిగోల్డ్ కొన్ని బ్రాంచీలను మూసివేస్తోంది. ఇక కస్టమర్లు చేసేదేమీ లేక లబోదిబోమంటున్నారు. ఎపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించింది. తాజాగా సెబి అగ్రిగోల్డ్ స్కీం లపై నిషేదం విధించడంతో పాటు, కొత్త స్కీంలను ప్రవేశపెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక అగ్రిగోల్డ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

తన అనుమతి లేకుండా బ్యాంకింగ్ వ్యవహారాలను ఎలా చేశారంటూ ఆర్.బి.ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీమాంధ్ర జిల్లాల్లో ఈ సంస్థ బాధితుల సంఖ్య ఎక్కువగా  ఉంది. ొక్క ప్రకాశం జిల్లాలోనే 1500 కోట్ల డబ్బులను సేకరించినట్లు సమాచారం. అయినా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులను నమ్మకుండా ఇలాంటి ప్రైవేట్ సంస్థలను నమ్ముకుంటే ఇలానే అవుతుంది. అయినా రోజుకో ఘటన గురించి మనం వింటున్నా ఇప్పటికీ చాలా మంది ఇలాంటి ప్రైవేట్ సంస్థల బారినపడి నష్టపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles