Religious intolerance would have shocked mahatma says obama

Religious intolerance would have shocked Mahatma, US President Barack Obama on india, obama on religious intolerance, barrack obama , America president obama, religious faiths, religious faiths would have shocked Mahatma, Defense, American companies, Richard Verma, Hyderabad, Bangalore, defense deals, US Ambassador

US President Barack Obama on Thursday said the "acts of intolerance" experienced by religious faiths of all types in India in the past few years would have shocked Mahatma Gandhi.

భారత్ పై అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబామా సంచలన వ్యాఖ్యలు

Posted: 02/06/2015 03:35 PM IST
Religious intolerance would have shocked mahatma says obama

భారత గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథిగా వచ్చిన తొలి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా... తన పర్యటనలో భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ఆకాశానికెత్తిన ఆయన స్వదేశానికి వెళ్లగానే భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మతపరమైన విద్వేషపూరిత చర్యలు ఆ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీని షాక్‌కు గురి చేసేవంటూ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లోని భిన్నత్వంపై ప్రశంసలు కురిపిస్తూనే, వివిధ వర్గాల మధ్య నెలకొన్న విద్వేషాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ విశ్వాసాలను కాపాడుకునే క్రమంలో మరొకరి విశ్వాసాలు, సంస్కృతులపై దాడి చేయడం భారత్‌లో పరిపాటిగా మారిందని ఆయన అన్నారు.
 
మతంపై విశ్వాసం ప్రజలతో మంచి చేయిస్తుందని.. అదేసమయంలో అదో ఆయుధంలా మారుతుందని కూడా అభిప్రాయపడ్డారు. మత అసహనం ఏ ఒక్క మతానికో, జాతికో చెందినది మాత్రమే కాదని.. అందరిలోనూ ఉందన్నారు. మతం పేరిట జరిగే హింస ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదని.. క్రైస్తవంలోనూ ఉందని వ్యాఖ్యానిస్తూ క్రూసేడులు, ఇంక్విజిషన్‌ (సంప్రదాయ వ్యతిరేకులపై రోమన్‌ క్యాథలిక్‌ చర్చ్‌ చట్టాల నీడన కొన్ని మత సంస్థలు సాగించిన యుద్ధం) పేరిట జరిగిన హింసను గుర్తు చేశారు.
 
మరోవైపు భారత్-అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు కేంద్రంగా అమెరికా రక్షణ పరికరాల పరిశ్రమలను ప్రారంభించనున్నది. ఈ రెండు నగరాలు తమ సంస్థలకు ముఖ్యమైన వనరు అని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ మీడియాతో పేర్కొన్నారు. భారత్ కేంద్రం గా రక్షణ పరికరాలను రెండు దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధి, ఉత్పత్తి చేపట్టనున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఈ రెండు నగరాలను పరిశ్రమల ఏర్పాటుకు ఎంచుకోనున్నట్లు రిచర్డ్ సూత్రప్రాయంగా తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Religious intolerance  Barack Obama  Mahatma Gandhi  

Other Articles