Telangana government hikes vat on petrol

telangana government hikes vat on oil, ts government hikes vat on oil, telangana government hikes value added tax again, telangana government to accumulate funds, Telangana government, telangana chief minister KCR, value added tax

Yet again telangana government hikes value added tax on petrol and diesel to accumulate funds

మళ్లీ వ్యాట్ వాత పెట్టిన తెలంగాణ సర్కార్

Posted: 02/05/2015 05:05 PM IST
Telangana government hikes vat on petrol

దేశంలో వున్న ప్రభుత్వాలు ప్రజల కోసమా..? లేక ఖజానాలను భర్తీ చేసుకోవడం కోసమా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. భారత దేశ రాజరిక పాలనలో విధించినట్లుగా పన్ను పోటును విధించి జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు. పెట్రోల్ ధరల నియంత్రణపై తమకు ఏమాత్రం హక్కు లేదని, అంతా చమురు సంస్థల నిర్ణయం ప్రకారమే జరుగుతుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. పెట్రో ధరలు తగ్గించాల్సినంత తగ్గించకుండా ఎడాపెడా ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచేసి, జనం సోమ్మును ఖజానాకు బదిలీ చేస్తోంది.

ఇప్పుడు... అదే క్రమాన్ని అనుసరించి తెలంగాణలో కేసీఆర్‌ సర్కారు సైతం వ్యాట్‌’ను అమాంతం పెంచేసింది. గత నెల 17 పెట్రోల్ ధర తగ్గగానే అమాంతంగా 31 శాతం మేర వ్యాట్ విధించిన తెలంగాణ సర్కారు.. ఇప్పుడు కూడా తాజాగా మరోమారు వ్యాట్ 35.25 శాతానికి పెంచేసి ఖజానాను భర్తీ చేసుకుంటోంది. కేంద్రం ఇంధన మంత్రిత్వ శాఖతో సమావేశానంతరం లీటరు పెట్రోలు పై రెండు రూపాయల 47 పైసలు, లీటరు డీజిల్ పై 2 రూపాయల 25పైసలు తగ్గిన పెట్రోలు ధరలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ 63 రూపాయల 91 సైసలకు లభ్యమయ్యింది. కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా వడ్డించిన వాతలతో ఇంధన ధరలు మళ్లీ యధాతథ ధరకే లభ్యం కానున్నాయి.

ఈ మేరకు గురువారం కేసీఆర్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో  పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా తగ్గినా.. ఆ రాయితీ వినియోగదారుడికి అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది.  ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సర్కారుకు పెట్రో ధరలపై విధించే పన్ను అయాచిత వరంగా కలిసొచ్చింది. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునే పేరుతో వ్యాట్ గతనెల్లో కూడా బాది మరీ ప్రజల నడ్డి విరిచింది. అంతర్జాతీయ చమురు ధరలు తీవ్రస్థాయిలో పడిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. వరుసుగా రెండో సారి వ్యాట్ ను పెంచడం వినియోగదారుల్లోఆందోళన కల్గిస్తోంది. ఇంతమాత్రానికి ధరల తగ్గించామని కేంద్రం.. వ్యాట్ పెంచామని రాష్ట్రం ప్రకటించకుండా వుంటే మేలని వాహనదారులు ఉసురుమంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vat  petrol  telangana government  diesel  

Other Articles