America ohio court summons andhra pradesh government department of water irrigation

america ohio court, andhra pradesh government, water supply department, water irrigation department, ohio court notice ap govt, krishna srivastava, america robbins company, eliminet madhava reddy project, pula subbaiah veligonda project

america ohio court summons andhra pradesh government department of water irrigation

అమెరికా ప్రైవేట్ సంస్థల మధ్య కేసులో ‘ఆంధ్ర’ ప్రభుత్వానికి నోటీసులు

Posted: 01/31/2015 10:13 AM IST
America ohio court summons andhra pradesh government department of water irrigation

అమెరికాలోని రెండు ప్రైవేట్ సంస్థల మధ్య దాఖలైన కేసు వివాదంలో అక్కడి కోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అందజేయాలంటూ అమెరికాలోని ఓహియో న్యాయస్థానం ఈమేరకు నోటీసులు జారీచేసినట్లు సమాచారం! అమెరికాతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయస్థానం కోరిక వివరాలు ఖచ్చితంగా అంజేయాల్సిందేనని న్యాయశాఖ నిపుణులు స్పష్టం చేయడంతో.. ఆ సాగునీటి ప్రాజెక్టుల వివరాలను సేకరించడంలో అధికారులు నిమగ్నమైపోయారు. అసలు ఈ వివాదం ఎలా తెరమీదకొచ్చింది తెలుసుకోవాలంటే.. మేటర్’లోకి వెళ్లాల్సిందే!

పదేళ్లక్రితం మొదలైన ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎంఆర్) ప్రాజెక్టులో 43.5 కి.మీ. మేర.. అలాగే పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో 19.2 కి.మీ. సొరంగం నిర్మించే కాంట్రాక్టు అమెరికాకు చెందిన ద రాబిన్స్ కంపెనీకి అప్పగించడం జరిగింది. ఇందులో భాగంగా రాబిన్స్ కంపెనీకి తానూ సాంకేతిక సహకారం అందించానని పేర్కొంటున్న కృష్ణ శ్రీవాస్తవ అనే వ్యక్తి.. అందుకు తనకు దక్కాల్సిన ఫీజులు ఇంకా ఇవ్వలేదంటూ అతడు ఓహియో కోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే.. ఆ ప్రాజెక్టులకు, కృష్ణ శ్రీవాస్తవకు ఎటువంటి సంబంధం లేదని రాబిన్స్ కంపెనీ కోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహానికి గురైన కృష్ణ.. అందుకు సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు. ప్రాజెక్టుల దస్త్రాలను పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆయన పిటిషన్’లో పేర్కొన్నాడు.

దీంతో ఈ ప్రాజెక్టుల పూర్తి వివరాలను, ఇతరత్ర సమాచారం, సంబంధిత నివేదికలు అందించడమంటూ ఓహియో కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని సేకరించే పనిలో నీటిపారుదలశాఖ అధికారులు తలమునకలయ్యారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles