Andhra pradesh higher education bank accounts freeze sbh ganta srinivas rao fires kcr

ganta srinivas rao, kcr news, sbh bank news, ganta srinivas rao fires kcr, ap higher education, telangana higher education, ganta srinivas rao latest news

andhra pradesh higher education bank accounts freeze sbh ganta srinivas rao fires kcr : ap minister ganta srinivas rao fires on kcr and sbh for freezing ap higher education bank accounts

కేసీఆర్ ఎఫెక్ట్ : SBHపై పరువునష్టం దావా?

Posted: 01/30/2015 06:18 PM IST
Andhra pradesh higher education bank accounts freeze sbh ganta srinivas rao fires kcr

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం SBHకు పెద్ద సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. ఆంధ్రరాష్ట్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆదేశాలు జారీ చేసిన మేరకు దానిని అమలు చేసినందుకు SBH ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో వివాదాలు వుండగా.. ఈ తాజా వివాదం చోటు చేసుకుంది. అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య SBH ప్రస్తావన ఎందుకు వచ్చిందనేగా సందేహం? అది తెలుసుకోవాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేస్తూ SBH నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి జారీ చేసిన ఆదేశాలమేరకే బ్యాంకు ఈ విధంగా నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే.. హఠాత్తుగా ఇలా ఖాతాను ఫ్రీజ్ చేయడంపై ఉన్నత విద్యామండలి అధికారులు, ఏపీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ సర్కార్, SBHపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా ఉద్యమనేతలాగే వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ సర్కార్ వైఖరి చూస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక రాజ్యాంగం వుందా..? అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ఇక ఏపీ విద్యామండలి అకౌంట్లను ఫ్రీజ్ చేసిన వ్యవహారంలో SBH మీద పరువునష్టం దావా వేస్తానని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ganta srinivas rao news  kcr news  sbh bank  defemation  

Other Articles