Handwriting pass ports invalid hyderabad regional pass port officer ashwini sattar press meet

Handwriting pass ports, hyderabad regional pass port office, hyderabad regional pass port officer ashwini sattar, ashwini sattar news, ashwini satta press meet, hyderabad pass port offices, machine readable pass ports

Handwriting pass ports invalid Hyderabad Regional Pass Port Officer press meet : Hyderabad Regional Pass Port Officer ashwini sattar has given statement that.. the handwriting passports will not approve from november 14 in this year. she told to change all passports in machine readable.

‘ఇకనుంచి చేతిరాత పాస్ పోర్టులు చెల్లవు’!

Posted: 01/29/2015 01:27 PM IST
Handwriting pass ports invalid hyderabad regional pass port officer ashwini sattar press meet

పాస్ పోర్టు అమలు విషయంలో గతంలో వున్న నియమాన్ని ఇప్పుడు మార్చేశారు. ఇకనుంచి చేతిరాత పాస్ పోర్టులు చెల్లవని హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోస్ట్ అధికారిణి అశ్విని సత్తారు ప్రకటించారు. చేతిరాత పాస్పోర్టులను మిషన్ రీడబుల్ చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే.. ప్రతి పాస్పోర్టులోనూ ఖచ్చితంగా రెండు పేజీలు ఖాళీగా వుండాలని ఆమె స్పష్టం చేశారు. అలా లేనిఎడల జంబో పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ 24వ తేదీ నుంచి ఈ చేతిరాత పాస్ పోర్టులను స్వీకరించబోమని పేర్కొన్న ఆమె.. వీలైనంత త్వరగా 20 ఏళ్ల క్రితం నాటి పాస్ పోర్టులను మిషన్ రీడబుల్’గా మార్చుకోవాలని కోరారు.

ఇదిలావుండగా.. హైదరాబాదులోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం దేశంలోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని అశ్విని తెలిపారు. 2013తో పోల్చుకుంటే 2014లో పాస్ పోర్టు జారీలో 13 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్న ఆమె.. 2014లో రికార్డు స్థాయిలో దాదాపు 14 లక్షల పాస్ పోర్టులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే.. గతేడాదిలో కేవలం 6.95 లక్షల పాస్ పోర్టులను మాత్రమే జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ త్వరలోనే వైజాగ్ పాస్ట్ పోర్టు ఆఫీస్’ను రీజనల్’గా మార్చబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఏదేమైనా.. చేతిరాత పాస్ పోర్టులను త్వరగా మార్చుకోవాలంటూ సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles