Barack obama mischelle obama unhappy saudi arabia tour

barack obama news, barack obama mischelle obama, barack obama saudi tour, obama couple saudi tour, obama couple saudi arabia tour, mischelle obama saudi arabia tour, saudi arabia rules traditions

barack obama mischelle obama unhappy saudi arabia tour : mischelle obama feeling unhappy when she land in saudi arabia. Because the ministers of the saudi state has no one make handshake with her.

సౌదీ పర్యటనలో మిషెల్ ఒబామా నిరాశ.. స్కార్ఫ్ లేదని విమర్శలు!

Posted: 01/28/2015 02:41 PM IST
Barack obama mischelle obama unhappy saudi arabia tour

ఇండియాలో మూడురోజుల పర్యటన ముగించుకున్న అనంతరం ఒబామా దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాకు పయనమైన విషయం తెలిసిందే! ఈ పర్యటనలో భాగంగా సౌదీలో అడుగుపెట్టిన మరుక్షణమే బరాక్ భార్య మిషెల్ తీవ్ర నిరాశను వ్యక్తం చేసినట్లు సమాచారం! ఈ సౌదీ పర్యటన ఆమెను చాలా బాధ కలిగించిందని అంటున్నారు. ఎందుకంటే.. సౌదీలో విమానం దిగిన తరువాత అక్కడి అధికారులు ఒబామాను మర్యాదపూర్వకంగా పలకరించడంతోపాటు కరచాలనం చేశారు. కానీ మిషెల్’తో మాత్రం చేతులు కలపలేదు. పైగా.. ఆమెతో ఎక్కువ సేపు మాట్లాడలేదు కూడా! కేవలం ‘హెలో’ అంటూ పలకరించి అధికారులు వెళ్లిపోయారు.

ఇదిలావుండగా.. సౌదీలోని సంస్కృతీ-సంప్రదాయాల ప్రకారం మహిళలు తమ శరీరంతోపాటు ముఖాన్ని బుర్ఖా (స్కార్ఫ్)తో పూర్తిగా కప్పుకోవాల్సి వుంటుంది. కానీ మిషెల్ ఒబామా తన ముఖానికి అలా స్కార్ఫ్ కట్టుకోలేదు. దీంతో అక్కడి న్యూస్ ఛానెళ్లు ఈమెను మొత్తంగా బ్లర్ చేసి చూపించారని సమాచారం! అయితే అక్కడి వార్తాఛానెళ్లు తాము అలాంటి పనిచేయలేదని చెబుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆమెను బ్లర్ చేసినట్లుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. పైగా.. ఆమె ముఖానికి స్కార్ఫ్ వేసుకోలేదంటూ అక్కడి ప్రజలు మిషెల్’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే సోషల్ మీడియా, వార్తా ఛానెళ్ల మధ్య ఈ స్కార్ఫ్’ఫై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో కొందరు మిషెల్’ను బ్లర్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే.. అదంతా మొత్తం అబద్ధం, సోషల్ మీడియాను కాదు నిజాన్ని నమ్మండి అంటూ ఆ ఫోటోలకు వ్యతిరేకంగా పత్రిక, ఛానెళ్లువాళ్లు తెలుపుతున్నారు.

నిజానికి సౌదీలో ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలనే సంప్రదాయం కేవలం ఆ దేశస్తుల మహిళలు మాత్రమే అమలు చేయాల్సి వుంటుంది. ఇతర దేశాల నుంచి అక్కడి వెళ్లినవాళ్లు ముఖానికి కండువా కప్పుకోవాలనే నియమేమీ లేదు. మరిప్పుడు మిషెల్ ఒబామా తన ముఖానికి కండువా కప్పుకోలేదంటూ ఎందుకు వివాదం రేపుతున్నారో అర్థం కావడం లేదు. ఏదైతేనేం.. ఈ సౌదీ ట్రిప్’తో మిషెల్ ఒబామా అస్సలు సంతోషంగా లేదన్నది మాత్రం వాస్తవం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles