India vs austrlia tri series match cancelled sydney

india vs australia, india vs australia tri series, india vs australia sidney match, india vs australia sidney match cancel, sidney oneday match, india cricket team, australia cricket team

india vs austrlia tri series match cancelled sydney : india vs austrlia tri series match cancelled in sydney due to heavy rain.

భారత్ ఆశలపై నీళ్లు చల్లిన ‘వరుణుడు’!

Posted: 01/26/2015 04:23 PM IST
India vs austrlia tri series match cancelled sydney

ముక్కోణపు సిరీస్’లో భాగంగా ఇండియాజట్టు మొదట్లో వరుసగా ఓడిపోవడంతో ఫైనల్లోకి వెళ్లడం చాలా క్లిష్టంగా మారిన సంగతి తెలిసిందే! ఆసీస్, ఇంగ్లాండ్’తో జరిగే రెండు మ్యాచుల్లోనూ భారత్ ఖచ్చితంగా గెలవాల్సి వుండేది. అయితే.. ఇంతలోనే భారత్ ఆశలపై ఆ వరుణుడు నీళ్లు చల్లేశాడు.

సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇంకా మ్యాచ్ మొదలుకాకముందే పలుమార్లు వర్షం పడింది. అయితే కొద్దిసేపటి తర్వాత తగ్గిపోవడంతో కొన్ని ఓవర్లు కుదించి మ్యాచ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే 44 ఓవర్ల వరకు కుదించి మ్యాచ్ ప్రారంభించడం జరిగింది. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్లీ వరుణుడు ధ్వజమెత్తాడు. దీంతో ఈ మ్యాచ్’నే రద్దు చేయడం జరిగింది. ఈ దెబ్బతో భారత్ ఫైనల్’కి వెళ్లడం చాలా క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.

ఈ మ్యాచ్’లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు బరిలోకి దిగగా.. మొదట వాతావరణం బాగానే వుండేది. అయితే.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. రాయుడి వికెట్ పడిన తర్వాత వర్షం మరోమారు భారీగా కురవడంతో మ్యాచ్’కు అంతరాయం కలిగింది. మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్’ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్ల ఖాతాలో రెండేసి పాయింట్లు చేరాయి.

ఇదిలావుండగా.. భారత్ తన తదుపరి మ్యాచ్’ను జనవరి 30వ తేదీన పెర్త్’లో ఇంగ్లాండ్’తో ఆడాల్సి వుంది. ఈ మ్యాచ్’లో ఇంగ్లాండ్’ను ఓడించి ఇండియా గెలిస్తేనే ఫైనల్’కు చేరుతుంది. లేకపోతే.. తట్టాబుట్టా సర్దుకుని భారత్’కి తిరిగి రావాల్సిందే! ఇకపోతే.. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే చేరిపోయింది. దీంతో ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. మరి.. అందులో ఇండియా గెలుస్తుందో..? లేదో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles