Barack obama republic day festivals militery strength indian weapons

barack obama, america president, republic day festivals, indian weapons, indian militery strength, barack obama latest news, barack obama couple, mischelle obama news

barack obama republic day festivals militery strength indian weapons : The america president barack obama surprised when he realize the indian militery strength in the republic day event.

భారత సైనికదళాన్ని చూసి హడలెత్తిన ఒబామా..

Posted: 01/26/2015 11:40 AM IST
Barack obama republic day festivals militery strength indian weapons

నిజానికి ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ భారతదేశాన్ని చిన్నచూపుతో చూస్తుంటారు. వ్యాపార, ఇతర వ్యవహారాల లావాదేవీల ఒప్పందాల్లో సన్నిహిత సంబంధమే వున్నప్పటికీ.. దేశాన్ని అంతగా గౌరవించరు. ముఖ్యంగా సైనిక ఆయుధాల విషయంలో అయితే.. తమదేశమే గొప్పదన్నట్లుగా డప్పులు వాయించుకుంటారు. అందులో అమెరికాలాంటి అగ్రరాజ్యమైతే ఎప్పటికీ ముందుంటుంది. కానీ.. గణతంత్ర వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. భారత సైనికి శక్తి, ఆయుధాలను చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఇండియా వద్ద ఎటువంటి ఆయుధాలు వున్నాయో చూసిన ఆయన.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

66వ గణతంత్ర వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన బరాక్ ఒబామా.. దేశంలో ఎటువంటి సైనిక శక్తి, ఆయుధాలు వున్నాయో స్వయంగా తిలకించారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన యుద్ధ సాహసాల విన్యాసాల నేపథ్యంలో దేశంలో వున్న అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించడం జరిగింది. అత్యాధునిక యుద్ధ ట్యాంకులు, ఒకేసారి 12 మిసైళ్లను గాల్లోకి పేల్చి విమానాలను ధ్వంసం చేయగల మల్టీ రాకెట్ లాంచర్లు, ఖండాంతర క్షిపణులు, తేలికపాటి ఆయుధాలు, భారీ విధ్వంసం సృష్టించగల బాంబర్లు తదితరవన్నీ ప్రదర్శనలో భాగం అయ్యాయి. డీఆర్డీఓ తయారుచేసిన ఆకాష్, అగ్ని తదితర క్షిపణులు అందరినీ అలరించాయి.

ఆ తర్వాత వివిధ విభాగాలకు చెందిన సైనికులు పరేడ్ నిర్వహించారు. అయితే ఈసారి ముందుకంటే కాస్త భిన్నంగా తొలిసారిగా మహిళలు ఈ ప్రదర్శనలో భాగమయ్యారు. మహిళలు కూడా ఈ పరేడ్’లో పాల్గొన్న నేపథ్యంలో ప్రజలందరూ చప్పట్ల హోరుతో వారికి స్వగతం పలికారు. మంచువర్షం కురుస్తున్నప్పటికీ సైనికులు పరేడ్ నిర్వహించడంలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవడంతోపాటు తమ విధులను సక్రమంగా నిర్వహించారు. అలాగే బయటున్న సెక్యూరిటీ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఈ విధంగా ఆయుధాలతోపాటు, సైనిక శక్తిని వీక్షించిన బరాక్ ఒబామా.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అలాగే.. తమ దేశానికి ధీటుగానే భారతదేశం వున్నట్లుగా ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barack obama news  indian weapons  indian militery strength  

Other Articles