Modi government faces netizens ire over padma awards

modi government faces netizens ire, netizens ire over padma awards, padma awards 2015 announced, padma awards list 2015, list of padma awards winners 2015, baba ramdev latest news, baba ramdev padma award, padma awards 2015 list, pandit ravi shanker prasad padma award, salim Khan padma award,

Narendra Modi government faces netizens ire over honouring spiritual gurus and BJP sympathisers with padma awards

ఎవరు వీళ్లు..? వీళ్లకెందుకు పద్మా అవార్డులు..?

Posted: 01/23/2015 08:41 PM IST
Modi government faces netizens ire over padma awards

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది బాలీవుడ్ తారలతో పాటు, ఆత్యాత్మిక గురువులు, రాజకీయ కురువృద్దులకు దేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందించాలని నిర్ణయంపై ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. మొత్తం 148 మందికి ప్రముఖులకు పద్మ అవార్డులను అందించాలని నిర్ణయించినప్పటికీ.. అందులో అధ్యాత్మిక గురువులకు, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ప్రచారానికి పత్యక్షంగా, పరోక్షంగా దోహదపడిన పలువురికి దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పద్మ అవార్డు జాబితాల పలువురు గురువులు, హింధూ మఠాధిపతులు, బీజేపి నాయకులు, బిజేపీ మిత్రపక్ష నేతలకు అత్యున్నత పౌర పురస్కారాలను ఎలా అందిస్తారంటూ సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా యెగా గురు బాబా రాందేవ్ కు పద్మభూషన్ అవార్డుకు ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కేసులు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కోంటున్న వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలను ఇచ్చి సత్కరించడంలో ఆంతర్యమేమిటో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికే తెలియాలని నెట్ జనులు ప్రశ్నలను సంధిస్తున్నారు.

అటు అవార్డలను ఎంపికైన వారితో పాటు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శల పర్వం సాగుతోంది. తమద పార్టీ మతపరమైనది కాదని, ప్రభుత్వం దేశ ప్రజలందరిదని చెబుతూనే.. అందుకు భిన్నంగా వ్యవహరించడంపై అంతర్జాల ప్రజలు  కేంద్ర అంతరంగాన్ని ఎండగడుతున్నారు. మతవాద ప్రకటనలు చేసిన,  వ్యాఖ్యలు చేసిన పలువురు బీజేపి నేతలపై పార్టీ అధిష్టానం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, ఇప్పుడు పీఠాధిపతులకు, అద్యాత్మిక గురువులకు, పార్టీ ప్రచారానికి పాటలు రాసిన వారికి, బీజేపీ నేతలకు ఎన్నికల స్క్రిప్టు రూపోందించిన వారికి అవార్డులను అందించడం ఏంటని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు కేంద్రంలోని మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : padma awards  netzens  central government  

Other Articles