Saudi king abdullah passes away

saudi arabia king abdullah died, saudi arabia king, saudi arabia king abdullah, saudi arabia king abdullah passed away, saudi arabia king abdullah health detoriated, saudi arabia king family, saudi arabia king passed away, saudi arabia king abdullah death, prince salman made king of saudi, king abdullah suffered from pneumonia, barack obama expressed condolences

Throngs of mourners gathered in Mecca early Friday just hours after Saudi Arabia's King Abdullah bin Abdulaziz al Saud died. He was 90.

సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబులజీజ్ ఇకలేరు..

Posted: 01/23/2015 10:31 AM IST
Saudi king abdullah passes away

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ (90) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన చికిత్స సొందుతూ గత రాత్రి మరణించారు. అబ్దుల్లా న్యూమోనియా బారిన పడి మరణించినట్లు సమాచారం. అబ్దులా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు సల్మాన్ సౌదీకి నూతన రాజుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూమోనియాతో బాధపడుతున్న అబుద్దలా గత రాత్రి పోద్దుపోయిన తర్వాత ఒంటిగంటకు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 1923లో జన్మించిన అబ్దుల్లా 2005 నుంచి సుమారు దశాబ్ద కాలం పాటు సౌదీ అరేబియా రాజుగా కొనసాగుతున్నారు. సౌదీ రాజు

అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెలగిన మహ్మదీయ రాజుగా ఆయన ఖ్యాతి గడించారు. అమెరికా సూచనల మేరకు ఆల్ ఖైదాకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. సౌదీ అరేబియాలో మహిళల అభ్యున్నతికి పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతేకాదు ప్రపంచంలోనే చమురు ఎగుమతి చేసే వ్యక్తుల్లో అగ్రగన్యుడిగా పేరుగాంచిన అబ్దుల్లా మరణంపై ప్రపంచ దేశాలు సంతాపం తెలిపాయి. అమెరికా అధ్యక్షుగు బరాక్ ఒబామా కూడా అబ్దుల్లా మృతి పట్ల సంతాపం తెలిపారు. సౌదీ దేశ ప్రజలకు ఒబామా సానుబూతిని తెలిపారు. అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ పెద్ద దైర్యశాలి అని, ఆయన తీసుకున్న నిర్ణయాలే సౌదీని పురోగాభివృద్ది దిశగా పయనింపజేశాయన్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపులో వుంచేందుకు ఆయన నిత్యం శ్రమించారన్నారు.

అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ వుల్ సౌదీ అంత్యక్రియలను ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు సౌదీ అరేబియా అధికారిక వర్గాలు తెలిపాయి. మహ్మదీయులు పరమ పవిత్రమైన రోజుగా భావించే శుక్రవారం రోజున.. మధ్యహ్నం ప్రార్థనల అనంతరం అబ్దుల్లాను మహ్మదీయ శాస్త్ర ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saudi Arabia  King Abullah  Prince Salman  Riyadh  Saudi Crown  

Other Articles