Facebook users post trouble for kerala minister accused of corruption

Facebook trouble for Kerala minister, Kerala minister accused of corruption, KM mani faces facebook trouble, KM mani accused of corruption, KM mani facing a new form of protest, netizens flooding him with money orders, mani demands Rs. 2 crore bribe, young south Indian director Aashiqu Abu, KM Mani, Kerala finance minister, social media, Facebook

Kerala's finance minister KM Mani, who is in the thick of corruption charges, is now facing a new form of protest. Angry netizens have started flooding him with money orders -- from Rs 5 to Rs 500 -- as they loosened their wallet in style for the 'poor minister'.

అవినీతి అమాత్యునిపై ఉద్యమానికి ఫేస్ బుక్ నాంది..

Posted: 01/22/2015 08:53 AM IST
Facebook users post trouble for kerala minister accused of corruption

సోషల్ మీడియా.. ఇప్పుడు ఏ పని చేసినా.. అది మంచిదైనా చెడుదైనా.. క్షణాల్లో దానికి తగిన ఫలితం వస్తుంది. షోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ దేశంలో మూడ దశాబ్దాల తరువాత కేంద్రంలోని మోడీ సర్కార్ కు మూడింట రెండొంతుల మెజారిటీని తెప్పించింది. అందుకే ప్రధాని మోడీ కూడా తన మంత్రివర్గ సహచరులకు ప్రజలతో అధికంగా కలసివుండేందుకు సాధనంగా ఎంచుకున్న సోషల్ మీడియాతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. అందులోనూ యువత అత్యంత అకర్షిస్తున్న ఫేస్ బుక్ గురించి చెప్పనక్కర్లేదు,

మున్నాభాయ్ జిందాబాద్ సినిమా తరహాలో ఓ అవినీతి అమాత్యుడికి విన్నూత తరహాలో నిరసన తెలిపే కార్యక్రమంలో ఫేస్ బుక్ భాగం పంచుకోవడంతో పాటు తన వంతు సహాయాన్ని అందించింది. కేరళలోని మధ్యం విధానంలో పలు మార్పలు చేర్పులు చేసేందుకు గాను మద్యం దుకాణాల యజమానుల నుంచి కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి సుమారు రెండు కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు ఆరోఫణలు వెల్లువెత్తాయి. దాంతో ఆగ్రహం చెందిన నెట్ జనులు అతని వ్యవహారా శైలికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు.

కేరళ యువ డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ దర్శకులు ఆషికీ అబు ముందుగా ఈ విషయమై స్పందించారు. కేరళ ఆర్థిక మంత్రి మణి చాలా పేదవారని, అందుకనే ఆయన లంచాన్ని డిమాండ్ చేశారని, ఈ నేపథ్యంలో తన వంతుగా 500 రూపాయలను విరాళాన్ని అందిస్తున్నానంటూ.. ఆయన మంత్రి  మణి నివాసానికి పంపిన మనీ ఆర్డరు రశీదును కూడా పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే సదరు పోస్టింగ్కు 9000 వేల హిట్స్ వచ్చాయి. కొందరు మంత్రి చర్యలను బాహాటంగానే వ్యతిరేకిస్తూ తిట్టగా, మరికొందరు కార్టూన్లు వేసి మరీ స్పందించారు. ఇలా ఇకటి రెండు కాదు కొందరు 5 రూపాయల నుంచి 500 వరకు విరాళాలను ప్రకటించారు. దీంతో కోట్టాయంలోని పాలాలో వున్న మంత్రి నివాస చిరునామాకు సుమారు 15 వేల రూపాయలు వరకు రాగా, వాటిని తీసుకెళ్లడానికి పోస్టుమన్లు జంకుతున్నారు. నెట్ జనుల ఆగ్రహంపై మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  corruption  kerala minister mani  

Other Articles