Chakri wife controversial comments on mother in law and chakri family members

chakri wife sravani news, chakri wife sravani comments, chakri with wife, chakri family members, chakri mother vidyavathi, chakri brother mahath, chakri sister, chakri death news, chakri assets controversy

chakri wife controversial comments on mother-in-law and chakri family members

డబ్బులన్నీ ఖర్చు చేసి.. ఇప్పుడు ఆస్తిమీద పడ్డారు!

Posted: 01/18/2015 05:12 PM IST
Chakri wife controversial comments on mother in law and chakri family members

ప్రముఖ సంగీత దర్శకుడు, దివంగత చక్రి మరణం తర్వాత ఆయన కుటుంబసభ్యుల మధ్య ఆస్తిగొడవలు మొదలైన సంగతి తెలిసిందే! ముఖ్యంగా చక్రి భార్య శ్రావణి మొదటినుంచి ఆయన మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ వస్తోంది. మరోవైపు ఆయన తల్లి విద్యావతి, సోదరుడితోపాటు ఇతర సభ్యులు శ్రావణి మీద ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఇలా ఒకరిమీదొకరు ఏదో ఒక ఆరోపణలు చేసుకుంటూనే వున్నారు. అంతెందుకు.. పోలీస్ స్టేషన్’లలో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా నమోదు చేయించారు. దీంతో చక్రి మరణంపై అనుమానాస్పద కేసును నమోదు చేసిన పోలీసులకు ఈ వ్యవహారం అంతుచిక్కకుండా పోతోంది.

ఇదిలావుండగా.. తాజాగా చక్రి సతీమణి మరోసారి తన అత్తగారింటిపై ఘాటుగా ఆరోపణలు చేశారు. తన భర్త మరణధ్రువీకరణ పత్రం రశీదును తీసుకునేందుకు పంజాగుట్ట శ్మశానవాటికకు వచ్చిన ఆమె మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు భర్త మరణంతో తీవ్ర దు:ఖంలో తాను వుండగా.. మరోవైపు అత్త విద్యావతి, ఆడపడుచు కృష్ణప్రియ, మరిది మహిత్’లు తనను వేధిస్తున్నారని గోడు వెళ్లబోసుకుంది.

చక్రి సంపాదన మీదే కుటుంబీకులు ఆధారపడేవారనీ, ఆయన ఉన్నప్పుడు పెద్దమొత్తంలో ఖర్చులు చేసి ఆడపడుచు బిడ్డలను చదివించేవారనీ, ఇప్పుడు వాటిని భరించే శక్తిలేక వారు కొత్తగా కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తమకు  సోమాజిగూడలో ఒకప్లాట్, మొయినాబాద్‌లో 1000 గజాల ఖాళీ స్థలం,  ఘట్‌కేసర్ వద్ద 666 గజాల మరోప్లాట్, తిరుపతిలో కూడా ఓ ఖాళీ స్థలం ఉన్నాయనీ తెలిపిన శ్రావణి.. ఇప్పుడు వాటిపైన అత్తింటివారు కన్నేశారని.. వాటిని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలనే నెపంతో నానారకాలుగా కుట్రలు పన్నుతున్నారని తెలిపింది.

చక్రి బతికున్న సమయంలో ఆయన, తాను కలిసి సరోగసి విధానంలో బిడ్డను పొందాలనుకున్నామని తెలిపిన శ్రావణి.. అది నెరవేరకుండానే చక్రి ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచారని ఏడుస్తూ తెలిపింది. అత్తింటి వారు చేసిన ఒత్తిళ్లకు మనోవేదనకు గురై చక్రి ప్రాణాలు కోల్పోయారని చెప్పిన ఆమె... తనకు అండగా చక్రి స్నేహితులు నిలుచున్నారనీ, వారి సాయంతో సమస్యలను అధిగమించగలనని చెప్పారు.  త్వరలో చక్రిపేరిట ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వర్ధమాన గాయనీ,గాయకులను ప్రోత్సహిస్తానన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chakri death news  chakri wife sravani  chakri family members news  

Other Articles