Case filed on chakri death against his wife sravani in jubilee hills police station

chakri death news, chakri wife sravani, chakri latest news, chakri death case, chakri wife sravani controversy, chakri house members, chakri mother, chakri brother

case filed on chakri death against his wife sravani in jubilee hills police station

చక్రి మృతిపై కేసు.. శ్రావణి వార్నింగ్ ఇచ్చిందట!

Posted: 01/15/2015 09:37 AM IST
Case filed on chakri death against his wife sravani in jubilee hills police station

ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి హార్ట్ ఎటాక్’తో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే! అయితే ఆయన మరణించిన తర్వాత కుటుంబసభ్యుల మధ్య తగాధాలు ఏర్పడ్డాయి. తనను వేధిస్తున్నారంటూ చక్రి భార్య శ్రావణి మీడియాముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తే.. చక్రి మృతిపై తమకు అనుమానాలు వున్నాయంటూ ఆయన కుటుంబసభ్యులు శ్రావణి మీద ఆరోపణలు చేశారు. ఇలా కొద్దిరోజుల నుంచి వీరు ఒకర్నొకరు దూషించుకుంటూనే వున్నారు. అయితే తాజాగా చక్రి మృతిపై ఐసీసీ సెక్షన్ 174 కింద అనుమాస్పద కేసుగా జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు.

తన కొడుకు మరణంపై అనుమానాలు వున్నాయని వెళ్లడిస్తూ వస్తున్న తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చక్రి మృతిని అనుమాస్పదంగా పేర్కొంటూ ఈ కేసును నమోదు చేశారు. తన కోడలు శ్రావణి వల్లే చనిపోయాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న తల్లి విద్యావతి.. తన కొడుకును చంపుతున్నానంటూ రెండుసార్లు తనకు ఫోన్ కూడా చేసిందని చెబుతోంది. కావాలంటే.. ఆ కాల్ డేటాను పూర్తిగా పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయంటూ ఆమె పేర్కొంటోంది. ఈ విధంగా ఆమె వెల్లడించడంతో పోలీసులు అనుమానాస్పద కేసును నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles