Popular leaders descendants face defeat in cantonment elections

secunderabad cantonment board elections, cantonment board elections results, popular leaders descendants defeated, survey satyanarayana, saiyanna, suhasini, lasya nandini, TRS, TRS rebels, BJP-TDP alliance, cingress party

secunderabad cantonment board elections results declared..

అప్పుడు వారికి.. ఇప్పుడు వారి వారసులకూ తప్పలేదు..

Posted: 01/13/2015 02:55 PM IST
Popular leaders descendants face defeat in cantonment elections

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు పార్టీల ముఖ్యనేతల వారసుల తలరాతలను మార్చివేశాయి. కంటోన్మెంట్ బోర్టు ఎన్నికల ఫలితాలో భాగంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎనిమిది వార్డులకు జరిగిన పోలింగ్‌లో నాలుగు వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగింట్లో టీఆర్‌ఎస్-2, టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థులు-2 స్థానాలను కౌవసం చేసుకున్నారు. మొదటి వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై రెబల్ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి 616 ఓట్ల తేడాతో గెలుపొందాడు. రెండవ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి సాదా కేశవరెడ్డి మాజీ ఎంపీ సర్వే కుమార్తె సుహాసినిపై 2,087 ఓట్ల తేడాతో గెలుపొందారు. మూడో వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి అనితా ప్రభాకర్ 600 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నాల్గొవ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ గెలుపొందారు.

కంటోన్మెంట్ ఎన్నికలలో గెలుపుతో తమ వారసులకు రాజకీయ భవిష్యత్ కల్పించాలని ఆశించిన నేతలు భంగపడ్డారు. ఇటు రాష్ట్ర మాజీ మంత్రి, అటు కేంద్ర మాజీ మంత్రుల వారసుల వైపు ఓటర్లు మొగ్గుచూపలేదు. ఇప్పటి వరకు వెలువరించిన ఫలితాలలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ తనయ సుహాసిని ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ బోర్డులోని రెండో వార్డు నుంచి పోటీ చేసిన సుహాసినిపై  టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి సదాకేశవరెడ్డి గెలుపొందారు. సుహాసినిపై 2,087 ఓట్ల ఆదిక్యంతో సదాశివరెడ్డి విజయం సాధించారు.

అటు నాలుగో వార్డులో స్థానిక టిడిపి ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిని ఓటమి పాలయ్యారు. నాల్గొవ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ 530 ఓట్ల తేడాతో లాస్య నందితపై గెలుపొందారు. రెండు పర్యాయాలు వరుసగా ఎంపీగా గెలిచి, కేంద్రంలో మంత్రిగా వ్యవహరించిన సర్వే సత్యానారాయణ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సాయన్న కూడా 2004, 2009 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. దీంతో అప్పట్లో తండ్రులను కలవర పెట్టిన ఓటమిని ఇప్పుడు తనయలను కూడా కలవర పర్చిందని స్థానిక ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cantonment board  elections  counting  secundrebad  

Other Articles