Indian space research gets new chairman

ISRO, Scientist Kiran Kumar, Secretary, Dept of space, Space Commission, India, mangalyaan, chandrayaan, shylesh naik, new chairman,

ISRO gets A kiran kumar as new chief and sucessor of radha krishnan

భారత అంతరిక్ష పరిశోధనకు కొత్త బాస్

Posted: 01/13/2015 01:15 PM IST
Indian space research gets new chairman

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ఆలూరి కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ గా కేంద్రం నియమితులయ్యారు. 62 ఏళ్ల ఈ భారత సీనియర్ పరిశోధకుడు 1975 నుంచి ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మాస్టార్స్ చేసిన ఆయన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి ఫిజికల్ ఇంజనీరింగ్ లో ఎం టెక్ పూర్తి చేశారు.

చంద్రయాన్-1, మంగళ్‌యాన్ తదితర ఉపగ్రహ ప్రయోగాల్లో కిరణ్ కుమార్ కీలక బాధ్యతలు నిర్వహించారు. 1979లో దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లిన భారత తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం బాస్కరలో ఇమేజ్ సెన్సార్లను ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిరణ్‌కుమార్ మూడేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్ పదవిలో కొనసాగుతారు. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ డిసెంబరు 31న పదవీవిరమణ చేయగా, ఆయన స్థానంలో శైలేష్‌నాయక్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isro  AS Kiran Kumar  Isro chairman  

Other Articles