Paris firing accused kouachi brothers arrested

Paris firing, Paris fresh firing, Paris firng accused arrest, kouachi brothers arrest, kouachi brothers found, Paris fresh firng on third day, paris third day firing, paris firing accused, charlie hebdo, paris terrorists, paris attack updates

Paris firing accused brothers arrested : Paris massacare kouachi brothers found after huge police chasing in north eastern paris. police nabbed kouachi brothers on friday both accused tries to escape in a stolen car and caught by police

ఆపరేషన్ సక్సెస్, పట్టుబడ్డ నరహంతకులు

Posted: 01/09/2015 03:23 PM IST
Paris firing accused kouachi brothers arrested

ప్యారిస్ లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. దేశ చరిత్రలో రక్తపు మరకలు ముద్రించిన కౌచి సోదరులను అరెస్టు చేశారు. సినిమా ఫక్కీలో చేజింగ్ ల మద్య ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల కోసం ఫ్రాన్స్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన పోలిసులు ఈశాన్య ప్రాంతంలోని 2వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ అనుమానిత కారును గుర్తించి వెంబడించారు. అనుమానిత కారు నుంచి పోలిసులపైకి కాల్పులు మొదలయ్యాయి. దీంతో తాము ఊహించింది నిజమని నమ్మిన పోలిసులు పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దింపారు.

ప్రతి సర్కిల్ లో భారీగా పోలిసు బలగాలతో పాటు, సాయుధ పోలిసుల పెట్రోలింగ్ వాహనాలు సిద్ధంగా ఉండటంతో అందర్నీ అలర్ట్ చేశారు. పోలిసులంతా వెంబడించి రౌండప్ చేయటంతో కౌచి సోదరులు తప్పించుకునేందుకు అవకాశం లేదు. దీంతో ఇద్దరు నిందితులు లొంగిపోయినట్లు ఫ్రాన్స్ హోం శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కారును వెంబడిస్తుండగా కాల్పులు జరగటంతో స్థానికులు ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రోజు దాడి తర్వాత ఓ కారును దొంగతనం చేసి పారిపోవటంతో బాధితుడు ఇచ్చిన వివరాల ప్రకారం కారుపై పోలిసులు నిఘా పెట్టారు. ఇవాళ కౌచి సోదరులిద్దరూ దొంగతనం చేసిన కారును వాడటంతో సులువుగా గుర్తించేందుకు వీలయింది.

12మందిని అతి దారుణంగా కాల్చి చంపి దేశ చరిత్రలో నెత్తుటేరు పారించిన నిందితులు అరెస్టు కావటంతో మృతుల సంబంధీకులతో పాటు, ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబీకులు కోరుతున్నారు. ప్రస్తుతం రహస్య ప్రాంతంలో ఉన్న వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paris firing  charlie hebdo  terrorist attacks  

Other Articles