Somireddy chandra mohan reddy slams owaisi brothers

TDP leader somireddy chandra mohan reddy, somireddy slams MIM leaders, somireddy slams owaisi brothers, somireddy slams asudaddin, somireddy slams akbaruddin, somireddy on ghar wapasi, somireddy lashes out on ghar wapasi

somireddy chandra mohan reddy slams owaisi brothers, says critises RSS but not Hindus

ఆర్ఎస్ఎస్ ను విమర్శించుకోండి.. హిందువులను కాదు..

Posted: 01/06/2015 10:00 PM IST
Somireddy chandra mohan reddy slams owaisi brothers

టీడీపీ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఎంఐఎం నేతలైన అన్నదమ్ములు అసుదుద్దన్, అక్బరుద్దిన్ వ్యాఖ్యాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒవైసీ సోదరులు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. గతంలో కూడా హిందువులను అవమానించేలా ఓవైసీ సోదరులు మాట్లాడారని గుర్తు చేశారు. అందరూ కలిసివుండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

ప్రతి భారతీయుడు ముస్లింగానే పుడుతున్నారని, తర్వాతే మతం మారుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇటువంటి వారిని 'ఘర్ వాపసీ' ద్వారా మళ్లీ ముస్లింలుగా మార్చాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థతో మీకు విభేదాలు వుంటే ఆ సంస్థను మీరు విమర్శించుకోండని, కానీ హిందువులను ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు ఆయన ఆంధ్రప్రదేశ్ విపక్ష్ నేత జగన్ పై కూడా విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్‌కు లేవని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన రాజధాని నిర్మాణంపై ప్రతిపక్షనేత జగన్‌కు అసలు అవగాహనే లేదన్నారు. ప్రజల ఆదరణ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్లకంటే అధికారంలో ఉండరని జగన్ జ్యోతిష్యం చెబుతున్నారని ఆయన ఆరోపించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somireddy chandra mohan reddy  owaisi brothers  Ghar wapasi  

Other Articles