Beer and wine sales rise as liquor demand stays high on new year

beer, beer sales in adhra pradesh, telangana Excise department, andhra pradesh excise department

wine sales rise on new year event

తాగి ప్రభుత్వ ఋణం తీర్చుకున్నారు!!

Posted: 01/02/2015 04:17 PM IST
Beer and wine sales rise as liquor demand stays high on new year

వారు మరి ప్రభుత్వానికి పన్ను కట్టే అతి పెద్ద పన్ను దారులు... వారే మందుబాబులు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రము లో అక్షరాల 150 కోట్ల మద్యాన్ని తాగేశారు. డిసెంబర్ 31 తో పాటు జనవరి 1 కలిపి మద్యం అమ్మకాలు 150 కోట్లు దాటినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దాంతో అధికారులు అవాక్కయారు. ఆ ఒక్కరోజే మద్యం ఏరులై పారటన్ని చూసి కొన్ని వర్గాలు విస్మయం చెందాయి.  రాష్ట్రము లో నెలకు సగటున 700 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. కాని ఒక్క డిసెంబర్ నెలలోనే ౩౦౦ కోట్ల మద్యం వ్యాపారం జరగటం పై పలు వర్గాలు విస్తు పోతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మందు బాబులు డిసెంబర్ 31 రోజే పీకల దాక తాగి ప్రభుత్వానికి పన్ను రూపేణ చెల్లించారు. మందుబాబులు మరి ముఖ్యంగా చల్ల చల్లగా బీర్ లే ఎక్కువగా తాగుతున్నారట మరీ... ఈ బీర్ ల అమ్మకాల నెలకు సగటున 60 కోట్లవరకు ఉంటున్నాయన్నది అంచనా.  ఈ మద్యం అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని మద్యం సిండికేట్లు పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మద్యం షాపులు అధికంగా ఉన్నందున ఈ జిల్లాల్లోనే మద్యం స్టాకు ఉంచుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో భారీ అమ్మకాలు జరిగితే, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విక్రయాలు జరుగుతాయి. మొత్తానికి మద్యం ఆదాయం ఏపీ ప్రభుత్వానికి బాగానే ‘కిక్కు’ ఇస్తున్నట్లుంది. దీని ద్వారానే అధిక ఆదాయం ప్రభుత్వానికి రావటం గమనార్హం.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh excise department  wine sales  drinkers  

Other Articles