Andhra pradesh cm chandrababu unveils smart village plan

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, AP Chief Minister Chandrababu Naidu, AP CM Chandrababu, AP CM Chandrababu unveils 'smart village' plan, Chandrababu says capital farmers to be brave,

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today unveiled a draft of 'Smart Village' plan aimed at making AP, a top state in the country by 2029.

మీ బాగుగులకు నాదీ పూచీ.. ధైర్యంగా వుండండీ..

Posted: 01/01/2015 08:23 PM IST
Andhra pradesh cm chandrababu unveils smart village plan

రైతుల దగ్గరే ఉంటూ ఎప్పటికప్పుడు మీ బాగోగులు చూస్తా'నని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్ర రాజధాని రైతాంగానికి హామి ఇచ్చారు.. తుళ్లూరులో తొలిసారిగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధైర్యపడవద్దని, అండగా ఉంటానన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం రాజధాని ప్రాంత రైతాంగానికి హామీ ఇచ్చిన సంగతి గుర్తుచేశారు. మీ బాగోగులకు తనది పూచీ అని చెప్పారు. భూములిచ్చిన రైతులు ధైర్యంగా వుండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని చెప్పారు. దిల్లీ కంటె గొప్ప రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని మోదీ మాటిచ్చారని చంద్రబాబు తెలిపారు. తరతరాలు తెలుగుజాతికి న్యాయం చేకూరాలనే రాజధాని నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాష్ట్రంలోని కేంద్ర భాగంలో రాజధాని ఉండాలనే తూళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మిస్తున్నామని, రాజధాని నిర్మాణానికి తుళ్లూరు ఒక్కటే సరైందని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. అందరి బాగోగులు చూసే బాధ్యత తానే పూర్తిగా తీసుకుంటానన్నారు. రాజధాని వల్ల రైతులు బాగుపడాలనే భూసమీకరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కొంతమంది దుండగులు పంటలను తగలబెట్టి, ప్రశాంతమైన ప్రాంతంలో దుండగులు అరాచకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తుళ్లూరులో రాజధాని నిర్మాణం కోసం ఐదుగురు రైతులు సీఎం సమక్షంలో నేడు తమ భూములను అందజేశారు. తుళ్లూరు, నేలపాడు, ఐనవోలు గ్రామాల రైతులు 161 ఎకరాల భూములు అందజేశారు. ఈ మేరకు తమ పాసు పుస్తకాలను చంద్రబాబుకు ఇచ్చారు. రాజధాని ప్రకటన తర్వాత తొలిసారి తుళ్లూరులో బహిరంగ సభలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబుకు రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chandrababu  Smart village  

Other Articles